Vikram: ‘రా’ ఏజెంట్‌గా కమల్‌?

అగ్రనటుడు కమల్‌హాసన్‌ కథానాయకుడి నటిస్తున్న చిత్రం ‘విక్రమ్‌’. లోకేష్‌ కనగరాజ్‌ దర్శకుడు. ఫహాద్‌ ఫాజిల్‌, విజయ్‌ సేతుపతి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. చిత్ర ట్రైలర్‌ను ఈ నెల 15న విడుదల చేస్తున్నట్లు

Updated : 05 May 2022 08:42 IST

గ్రనటుడు కమల్‌హాసన్‌ కథానాయకుడి నటిస్తున్న చిత్రం ‘విక్రమ్‌’. లోకేష్‌ కనగరాజ్‌ దర్శకుడు. ఫహాద్‌ ఫాజిల్‌, విజయ్‌ సేతుపతి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. చిత్ర ట్రైలర్‌ను ఈ నెల 15న విడుదల చేస్తున్నట్లు నిర్మాణ సంస్థ రాజ్‌ కమల్‌ ఫిల్మ్స్‌ ఇంటర్నేషనల్‌ ప్రకటించింది. అనిరుధ్‌ రవిచంద్రన్‌ స్వరపరిచిన ఈ చిత్ర ఆడియో ఆ రోజే విడుదల కానుంది. ఇదివరకే ప్రేక్షకుల ముందుకు వచ్చిన టైటిల్‌ టీజర్‌.. సినిమాపై అంచనాలు పెంచేసింది. ఈ సినిమాలో కమల్‌ ‘రా’ ఏజెంట్‌గా కనిపించనున్నాడని సమాచారం. ట్రైలర్‌ విడుదలై అనంతరం ఈ విషయంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని