KGF Chapter 2: కేజీయఫ్‌-2 నుంచి బిగ్‌ అప్‌డేట్‌

దేశవ్యాప్తంగా సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్‌ఇండియా చిత్రం ‘కేజీయఫ్‌-2’. యశ్‌ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘కేజీయఫ్‌’. ఈ చిత్రానికి కొనసాగింపుగా ‘కేజీయఫ్‌2’ ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.

Published : 03 Mar 2022 13:38 IST

ట్రైలర్‌ విడుదల ఆరోజే!

ఇంటర్నెట్ డెస్క్‌: దేశవ్యాప్తంగా సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్‌ఇండియా చిత్రం ‘కేజీయఫ్‌-2’. యశ్‌ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘కేజీయఫ్‌’. ఈ చిత్రానికి కొనసాగింపుగా ‘కేజీయఫ్‌2’ ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ అప్‌డేట్‌ ఇచ్చింది చిత్రబృందం. ‘‘మార్చి27 సాయంత్రం 6.40 గంటలకు ట్రైలర్‌ విడుదల కానుంది’’ అంటూ చిత్ర బృందం ట్వీట్‌ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్‌ 14న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది.  తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం, హిందీతో పాటు ఇంగ్లీష్‌లోనూ ఈ సినిమాను విడుదల చేయనున్నారు. శ్రీనిధి శెట్టి, సంజయ్ దత్, రవీనా టాండన్, రావు రమేష్, ప్రకాష్ రాజ్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. విజయ్‌ కిరంగదూర్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి రవి బస్రూర్‌ సంగీతం అందిస్తున్నారు.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని