Vijay Deverakonda: దుల్కర్‌ సల్మాన్‌ సినిమాలను అలా చూసేవాణ్ని: విజయ్‌ దేవరకొండ

హీరోలు విజయ్‌ దేవరకొండ, దుల్కర్‌ సల్మాన్‌ ఓ చిట్‌చాట్‌లో పాల్గొన్నారు.  తమ కొత్త చిత్రాల గురించి ముచ్చటించారు. ఒకరిపై ఒకరికి ఉన్న ఇష్టాన్ని వ్యక్తం చేశారు.

Published : 18 Aug 2023 23:05 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మలయాళ నటుడు దుల్కర్‌ సల్మాన్‌ (Dulquer Salmaan) చిత్రాలను తాను టోరెంట్స్‌లో చూసేవాణ్ని అని టాలీవుడ్‌ హీరో విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda) గుర్తు చేసుకున్నారు. తాను అభిమానించే నటుల్లో దుల్కర్‌ సల్మాన్‌ ఒకరని, ఒకవేళ మల్టీస్టారర్‌లో నటించాల్సి వస్తే దుల్కర్‌తో కలిసి పని చేస్తానని అన్నారు. తమ కొత్త సినిమాలను ప్రమోట్‌ చేసుకునే క్రమంలో ఇరువురు ఓ చిట్‌ చాట్‌లో పాల్గొన్నారు. ఒకరిపై ఒకరికి ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. విజయ్‌తో స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడం తనకూ ఇష్టమని దుల్కర్‌ చెప్పారు. స్క్రీన్‌ స్పేస్‌ కోసం తాము పోటీపడమని పేర్కొన్నారు. ‘కింగ్‌ ఆఫ్‌ కొత్త’కు సీక్వెల్‌ తెరకెక్కించే అవకాశం ఉందా? అని విజయ్‌ ప్రశ్నించగా దుల్కర్‌ ఉండొచ్చు అని సమాధానం ఇచ్చారు. గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో తాను నటిస్తున్న చిత్రంలోని పాత్ర.. ‘కింగ్‌ ఆఫ్‌ కొత్త’లోని పాత్ర కలిస్తే బాగుంటుందని విజయ్‌ అభిప్రాయపడ్డారు. దుల్కర్‌, కీర్తిసురేశ్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘మహానటి’లో విజయ్‌ దేవరకొండ ఓ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.

హైదరాబాద్‌లో పెళ్లి చేసుకోవడం ఇష్టం కానీ: వరుణ్‌ తేజ్‌

దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా దర్శకుడు అభిలాష్‌ జోషిలీ తెరకెక్కించిన చిత్రం ‘కింగ్‌ ఆఫ్‌ కొత్త’ (King of Kotha). ఐశ్వర్య లక్ష్మి కథానాయిక. ఈ సినిమా ఆగస్టు 24న విడుదల కానుంది. విజయ్‌, సమంత జంటగా నటించిన ప్రేమకథా చిత్రం ‘ఖుషి’ (Kushi). శివ నిర్వాణ దర్శకుడు. ఈ సినిమా సెప్టెంబరు 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని