Cinema News: ‘ఇండియన్-2’ పోస్టర్ అదుర్స్.. ఆకట్టుకునేలా ‘బుట్టబొమ్మ’ టీజర్
కొత్త చిత్రాలకు సంబంధించిన కొన్ని ఆసక్తికర అప్‌డేట్స్ వెలువడ్డాయి.
హైదరాబాద్: అగ్ర కథానాయకుడు, విశ్వనటుడు కమల్‌హాసన్ (Kamal Haasan) ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘ఇండియన్ -2’ (Indian 2). సోమవారం ఆయన పుట్టినరోజు పురస్కరించుకుని చిత్ర దర్శకుడు శంకర్ సరికొత్త పోస్టర్ షేర్ చేశారు. ఇందులో కమల్ వృద్ధుడి గెటప్‌లో కనిపించారు. ఆయన లుక్ ఆకట్టుకునేలా ఉంది. పవర్‌ఫుల్ కథాంశంతో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమాలో కాజల్ కథానాయిక. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది.
ఆకట్టుకునేలా ‘బుట్టబొమ్మ’
అనికా సురేంద్రన్, అర్జున్ దాస్, సూర్య, వశిష్ఠ ప్రధాన పాత్రధారులుగా నటిస్తోన్న ఫీల్‌గుడ్ చిత్రం ‘బుట్టబొమ్మ’ (Butta Bomma). సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ఈ సినిమా తెరకెక్కుతోంది. సోమవారం ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పుట్టినరోజు పురస్కరించుకుని చిత్ర నిర్మాణ సంస్థ ‘బుట్టబొమ్మ’ టీజర్‌ను విడుదల చేసింది. గ్రామీణ వాతావరణం నేపథ్యంలో సిద్ధమైన ఈ టీజర్ ఆకట్టుకునేలా ఉంది.
కల్యాణ్‌రామ్ కొత్త సినిమా టైటిల్
చాలారోజుల తర్వాత ‘బింబిసార’తో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు నటుడు కల్యాణ్ రామ్ (Kalyan Ram). టైమ్ ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా తర్వాత ఆయన మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై ఓ ప్రాజెక్ట్‌కు సంతకం చేశారు. రాజేంద్రా రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఈచిత్రానికి ‘అమిగోస్’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 10న దీన్ని విడుదల చేయనున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
NTR 30: యంగ్ టైగర్ కొత్త సినిమా షురూ.. బ్యాక్‌డ్రాప్ చెప్పేసిన కొరటాల శివ
-
Politics News
Amaravati: ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్.. ఓటేసిన సీఎం జగన్
-
Sports News
IPL: ఇకపై టాస్ గెలిచాకే.. ఐపీఎల్ నిబంధనల్లో మార్పులు చేసిన బీసీసీఐ
-
Movies News
Kalyan Ram: ఆయనతో నన్ను పోల్చవద్దు.. అంత పెద్దవాణ్ని కాదు: కళ్యాణ్‌రామ్
-
Crime News
Hyderabad: దేశవ్యాప్తంగా వ్యక్తిగత డేటా చోరీ.. పోలీసుల అదుపులో ముఠా
-
Movies News
Samyuktha: ‘విరూపాక్ష’ టీమ్‌పై నటి సంయుక్త ఆగ్రహం