Aadavallu Meeku Johaarlu Review: రివ్యూ: ఆడవాళ్ళు మీకు జోహార్లు
శర్వానంద్ నటించిన ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ సినిమా రివ్యూ
చిత్రం: ఆడవాళ్ళు మీకు జోహార్లు; నటీనటులు: శర్వానంద్, రష్మిక, రాధిక, ఖుష్బూ, ఊర్వశి, వెన్నెల కిషోర్, రవి శంకర్, సత్య, ప్రదీప్ రావత్, గోప రాజు, బెనర్జీ, కళ్యాణీ నటరాజన్, రాజశ్రీ నాయర్, ఝాన్సీ, రజిత, సత్య కృష్ణ, తదితరులు; ఛాయాగ్రహణం: సుజిత్ సారంగ్; సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్; కూర్పు: శ్రీకర్ ప్రసాద్; కళ: ఏఎస్ ప్రకాష్; నిర్మాత: సుధాకర్ చెరుకూరి; దర్శకత్వం: తిరుమల కిషోర్; బ్యానర్: శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్; విడుదల: 4-3-2022
కుటుంబ కథల్లో చక్కగా ఒదిగిపోయే యువ కథానాయకుల్లో శర్వానంద్ ఒకరు. ఇలాంటి వినోదంతో తెరకెక్కిన పలు సినిమాలతో ఆయన విజయాల్ని అందుకున్నారు. అయితే.. కొంతకాలంగా శర్వా తన శైలికి భిన్నంగా సీరియస్‌గా సాగే కథల్ని ఎంచుకుంటూ వస్తున్నారు. చాలా రోజుల విరామం తర్వాత మళ్లీ తన మార్క్ కుటుంబ కథతో ఆయన చేసిన చిత్రం ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’. ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించే కాంబినేషన్లో ఈ సినిమా మొదలు కావడం, ప్రచార చిత్రాలు కూడా ఆకట్టుకునేలా ఉండటంతో చిత్రంపై అంచనాలు పెరిగాయి. మరి ఈ సినిమా ఎలా ఉంది?.. శర్వానంద్‌ని మళ్లీ ఫామ్‌లోకి తీసుకొచ్చే సత్తా ఉన్న కథేనా? తదితర విషయాలు తెలుసుకునే ముందు కథేమిటో చూద్దాం.
కథేంటంటే: ఉమ్మడి కుటుంబంలో పెరిగిన ఒకే ఒక్క అబ్బాయి చిరంజీవి (శర్వానంద్). తనంటే ఇంటిల్లిపాదికీ గారాబం. చిరుకి పెళ్లి చేయాలని సంకల్పిస్తారు కుటుంబ సభ్యులు. అతడికి నచ్చినా.. ఇంట్లో ఆడవాళ్లకి మాత్రం ఓ పట్టాన అమ్మాయిలు నచ్చరు. అలా బోలెడన్ని సంబంధాల్ని తిరస్కరిస్తారు. పెళ్లి ప్రయత్నాల్లోనే ఉన్న చిరు జీవితంలోకి అనుకోకుండా ఆద్య (రష్మిక) ప్రవేశిస్తుంది. ఆ ఇద్దరూ తొందరగా దగ్గరవుతారు. చిరు కుటుంబ సభ్యులకీ నచ్చడంతో ఆద్యనే తమ ఇంటి కోడలిగా తీసుకు రావాలనుకుంటారు. కానీ ఆద్యకి పెళ్లి చేయడం వాళ్లమ్మ, వ్యాపారవేత్త అయిన వకుళ (ఖుష్బూ)కి ఇష్టం ఉండదు. కారణం తన జీవితంలో చోటు చేసుకున్న పరిణామాలే. ఆద్యనేమో తల్లి మాట జవ దాటని కూతురు. మరి ఈ పరిస్థితుల మధ్య చిరు-ఆద్యల పెళ్లి ఎలా జరిగిందన్నదే మిగతా కథ.
ఎలా ఉందంటే: కరోనా తర్వాత ఇంటిల్లిపాదీ కలిసి థియేటర్‌కి వచ్చేంతగా ఉత్సుకత రేకెత్తించిన సినిమాలు అరుదుగానే వచ్చాయి. ఈ సినిమా మాత్రం కుటుంబ ప్రేక్షకులే లక్ష్యంగా రూపొందింది. పేరు మొదలుకొని.. తెరపై కనిపించే పాత్రలు, మరీ ముఖ్యంగా మహిళల్ని ఆకర్షించేలా ఉండటం కలిసొచ్చే విషయం. దర్శకుడు తిరుమల కిషోర్ స్వచ్ఛమైన కుటుంబ వినోదంతో ఈ సినిమాని తెరకెక్కించారు. ఆడవాళ్ల మధ్య పెరిగిన ఓ పద్ధతైన కుర్రాడు, పెళ్లిపై సదాభిప్రాయం లేని ఓ మహిళ చుట్టూ ఈ కథని నడిపించాడు. చిరు పెళ్లి కష్టాలతోనే సినిమా మొదలవుతుంది. చిరు కుటుంబం పలువురు అమ్మాయిల్ని తిరస్కరించడం దగ్గర్నుంచి.. అమ్మాయిలే చిరుని తిరస్కరించడం వరకూ సాగే ఎపిసోడ్ నవ్విస్తుంది. ఆద్యతో చిరు ప్రయాణం మొదలయ్యాక ఓ ప్రేమకథని చూసిన అనుభూతి కలుగుతుంది. సన్నివేశాలు ప్రేక్షకుడి ఊహకు తగ్గట్టే సాగుతున్నట్టు అనిపించినా తిరుమల కిషోర్ రచనలో బలం వల్ల సంభాషణలు అర్థవంతంగా అనిపిస్తాయి. అక్కడక్కడా పంచ్‌లు పేలాయి. దాంతో కాలక్షేపం అవుతుంది.
ద్వితీయార్ధంలోనే కథలో అసలు సంఘర్షణ కనిపిస్తుంది. ఆద్య తల్లి వకుళ ప్రపంచంలోకి చిరు వెళ్లడం, అక్కడ చోటు చేసుకునే పరిణామాలు ఆసక్తికరంగా అనిపిస్తాయి. ప్రీ క్లైమాక్స్ సన్నివేశాలు.. తర్వాత ఏం జరుగుతుందనే ఉత్కంఠను రేకెత్తిస్తాయి. అయితే దర్శకుడు అక్కడ బలమైన సంఘర్షణ లేకుండా సాదాసీదాగా కథని ముగింపు దిశగా తీసుకెళ్లడం పెద్దగా మెప్పించదు. వకుళ గతం గురించి కేవలం మాటల్లోనే చెప్పించడంతో అంతగా భావోద్వేగాలు పండలేదు. మొత్తంగా సినిమా మాత్రం స్వచ్ఛమైన కుటుంబ కథతో ఇంటిల్లిపాదినీ మెప్పిస్తుంది. ‘మగాళ్ల విషయంలో సమస్య, పరిష్కారం రెండూ వేర్వేరు, కానీ ఆడవాళ్ల విషయంలో సమస్యని అర్థం చేసుకోవడమే పరిష్కారం’ తరహా సంభాషణలతో దర్శకుడు తిరుమల కిషోర్ చక్కటి రచన చేశారు. ఒక్క కథానాయకుడు, అక్కడక్కడా అలా వచ్చిపోయే పాత్రలు మినహా కథనంతా ఆడవాళ్ల చుట్టూ తిప్పిన విధానం కూడా మెచ్చుకోదగ్గదే.
ఎవరెలా చేశారంటే: శర్వానంద్ తన పాత్రలో ఒదిగిపోయాడు. తన జోన్ కథ, పాత్ర కావడంతోనేమో మరింత ఆత్మవిశ్వాసంతో కనిపించాడు. వెన్నెల కిషోర్, ఊర్వశి తదితరులతో కలిసి చేసిన సరదా సన్నివేశాల్లో బాగా నవ్వించాడు. ముఖ్యంగా శర్వా - ఊర్వశి విరామం సమయంలో చేసిన సందడి కడుపుబ్బా నవ్వించింది. రష్మిక సంప్రదాయమైన వస్త్రధారణతో అందంగా కనిపించింది. రాధిక, ఖుష్బూ, ఝాన్సీ తదితరులు బలమైన పాత్రల్లో కనిపించడం సినిమాకి కలిసొచ్చింది. వెన్నెల కిషోర్ ప్రథమార్ధంలో, సత్య, ప్రదీప్ రావత్ ద్వితీయార్ధంలో నవ్వించారు. సాంకేతిక విభాగాల్లో కెమెరా పనితనం చిత్రానికి ప్రధాన ఆకర్షణ. దేవిశ్రీ ప్రసాద్ సమకూర్చిన బాణీల్లో హాసమ్.. అంటూ సాగే పాట, దాన్ని చిత్రీకరించిన విధానం మెప్పిస్తుంది. టైటిల్ గీతంతోపాటు, నేపథ్య సంగీతం కూడా బాగుంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. దర్శకుడు తిరుమల కిషోర్ రాసిన కథ, కథనాల్లో చెప్పుకోదగ్గ మ్యాజిక్ కనిపించకపోయినా.. ఇంటిల్లిపాదీ కలిసి చూసేలా సినిమాని తీర్చిదిద్దిన విధానం మాత్రం మెచ్చుకోదగ్గది.
బలాలు
+ కీలకపాత్రధారుల నటన
+ స్వచ్ఛమైన కుటుంబ కథ
+ వినోదం, సంభాషణలు
బలహీనతలు
- ఊహకు తగ్గట్టుగా సాగే కథనం
చివరిగా: ఆడవాళ్ళు మీకు జోహార్లు... కుటుంబమంతా కలిసి చూసేలా!
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టికోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మలయాళంలో రూ.150కోట్లు కొల్లగొట్టిన మూవీ.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
జీతూ మాధవన్ దర్శకత్వంలో ఫహద్ ఫాజిల్ నటించిన ‘ఆవేశం’ ఓటీటీలో స్ట్రీమింగ్కు సిద్ధమైంది. -
రివ్యూ: ప్రణయ విలాసం.. ‘ప్రేమలు’ హీరోయిన్ నటించిన సినిమా ఎలా ఉందంటే?
మమితా బైజు, అర్జున్ అశోకన్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ప్రణయ విలాసం’. ‘ఈటీవీ విన్’లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా కథేంటంటే? -
రివ్యూ : బాక్.. తమన్నా, రాశీఖన్నాల హారర్ మూవీ ఎలా ఉంది
baak movie review: ‘అరణ్మనై’ సిరీస్‌లో నాలుగో భాగంగా వచ్చిన ‘బాక్’మూవీ సినీ ప్రేక్షకులను మెప్పించిందా? -
రివ్యూ: ఆ ఒక్కటీ అడక్కు.. అల్లరి నరేష్ ఖాతాలో హిట్ పడిందా?
aa okkati adakku review: అల్లరి నరేష్, ఫరియా జంటగా నటించిన కామెడీ ఎంటర్టైనర్ మెప్పించిందా. -
రివ్యూ: శబరి.. వరలక్ష్మీ శరత్‌కుమార్ నటించిన థ్రిల్లర్ ఎలా ఉంది?
sabari movie review in telugu: వరలక్ష్మీ శరత్‌కుమార్, గణేశ్ వెంట్రామన్ కీలక పాత్రల్లో నటించిన ‘శబరి’ మెప్పించిందా? -
రివ్యూ: ప్రసన్నవదనం.. సుహాస్ ఖాతాలో హిట్ పడిందా?
సుహాస్ కీలక పాత్రలో ఫేస్ బ్లైండ్నెస్ కాన్సెప్ట్‌తో రూపొందిన థ్రిల్లర్ మూవీ ఎలా ఉంది. -
రివ్యూ హీరామండి: ది డైమండ్ బజార్.. సంజయ్‌లీలా భన్సాలీ ఫస్ట్ వెబ్‌సిరీస్ ఎలా ఉంది?
భారీ తారాగణంతో సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపొందిన వెబ్‌సిరీస్ మెప్పించిందా? -
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
విద్యుత్ జమ్వాల్ నటించిన స్పోర్ట్స్ యాక్షన్ మూవీ ‘క్రాక్’. ఓటీటీ ‘డిస్నీ+ హాట్‌స్టార్’లో స్ట్రీమింగ్ అవుతోంది. -
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
Rathnam movie review: విశాల్ కథానాయకుడిగా హరి దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ ఫిల్మ్ తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా? -
రివ్యూ: ఆర్టికల్ 370.. యామి గౌతమ్, ప్రియమణి నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
యామి గౌతమ్, ప్రియమణి నటించిన పొలిటికల్ థ్రిల్లర్ మెప్పించిందా? -
రివ్యూ: మై డియర్ దొంగ.. అభినవ్ గోమఠం నటించిన సినిమా ఎలా ఉందంటే?
అభినవ్ గోమఠం, శాలిని కొండెపూడి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మై డియర్ దొంగ’. ఓటీటీ ‘ఆహా’లో విడుదలైన ఈ సినిమా రివ్యూ మీ కోసం.. -
రివ్యూ: సైరెన్.. జయం రవి, కీర్తి సురేశ్ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
siren movie review: జయం రవి కథానాయకుడిగా ఆంటోనీ భాగ్యరాజా దర్శకత్వంలో వచ్చిన ‘సైరెన్’ మూవీ తెలుగులో మెప్పించిందా? -
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
Paarijatha Parvam Review; చైతన్యరావు, సునీల్, శ్రద్ధాదాస్ కీలక పాత్రల్లో నటించిన క్రైమ్ థ్రిల్లర్ మెప్పించిందా? -
రివ్యూ: ఆట్టం.. మలయాళ సస్పెన్స్ డ్రామా ఎలా ఉంది?
వినయ్, కళాభవన్ షాజాన్, జరీన్ షిహబ్ కీలక పాత్రల్లో నటించిన ‘ఆట్టం’ ఎలా ఉంది? -
రివ్యూ: డియర్.. భార్య గురకపెట్టే కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ మూవీ మెప్పించిందా?
DeAr Movie 2024 Review: జీవీ ప్రకాష్‌కుమార్, ఐశ్వర్య రాజేశ్ కీలక పాత్రల్లో నటించిన ‘డియర్’ మూవీ మెప్పించిందా? -
రివ్యూ: శ్రీ రంగనీతులు.. సుహాస్, కార్తీక్ రత్నంల కొత్త మూవీ మెప్పించిందా?
sri ranga neethulu review: తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘శ్రీరంగ నీతులు’ మూవీ ఎలా ఉంది? -
రివ్యూ: బడే మియా ఛోటే మియా.. అక్షయ్, టైగర్ ష్రాఫ్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో అక్షయ్, టైగర్ ష్రాఫ్ కీలక పాత్రల్లో నటించిన ‘బడే మియా ఛోటే మియా’ మెప్పించిందా? -
రివ్యూ: గీతాంజలి మళ్ళీ వచ్చింది.. హారర్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
అంజలి కీలక పాత్రలో నటించిన హారర్ కామెడీ థ్రిల్లర్ ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ ప్రేక్షకులను మెప్పించిందా? -
రివ్యూ: లవ్‌గురు.. విజయ్ ఆంటోనీ మూవీ ఎలా ఉంది?
Love Guru Review: విజయ్ ఆంటోని, మృణాళిని రవి కీలక పాత్రల్లో నటించిన న్యూఏజ్ ఫ్యామిలీడ్రామా మెప్పించిందా? -
రివ్యూ: మైదాన్.. అజయ్ దేవ్‌గణ్ కీలక పాత్రలో నటించిన స్పోర్ట్స్ డ్రామా మెప్పించిందా?
భారత ఫుట్‌బాల్ కోచ్ అబ్దుల్ సయ్యద్ రహీం జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన ‘మైదాన్’ మూవీ ఎలా ఉంది? -
రివ్యూ: ప్రాజెక్ట్-Z.. సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
Project Z Movie Review: ఏడేళ్ల కిందట తమిళంలో విడుదలై తాజాగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ప్రాజెక్ట్-Z’ ప్రేక్షకులను మెప్పించిందా?
తాజా వార్తలు (Latest News)
-
నా లెక్కల మాస్టర్‌కి లెక్కేయలేనంత ప్రేమతో.. సుకుమార్‌కి బుచ్చిబాబు లేఖ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
భారత్ స్నేహ పూర్వకమే కాదు.. శక్తిమంతమైనది కూడా: జైశంకర్
-
దేశంలో పెరుగుతున్న ఘోస్ట్ మాల్స్.. ఇంతకీ ఏమిటివి...?
-
ఎప్పటికైనా పూర్తి యానిమేషన్ మూవీ తీస్తా.. ఆసక్తికర విషయాలు చెప్పిన రాజమౌళి
-
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం.. లక్షణాలు ఇవే!