Pushpa: వేర్‌ ఈజ్‌ పుష్ప..? గాయాలతో తప్పించుకున్న పుష్పరాజ్‌ ఎక్కడికి వెళ్లాడు..?

అల్లు అర్జున్‌ - సుకుమార్‌ కాంబోలో రానున్న ఊరమాస్‌ ఎంటర్‌టైనర్‌ ‘పుష్ప-2’ (Pushpa 2). తాజాగా ఈ సినిమా నుంచి ఆసక్తికర అప్‌డేట్‌ వచ్చేసింది.

Published : 05 Apr 2023 11:35 IST

హైదరాబాద్‌: ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌ (Allu Arjun) నటిస్తోన్న ఊరమాస్‌ ఎంటర్‌టైనర్‌ ‘పుష్ప ది రూల్‌’ (Pushpa The Rule). సుకుమార్‌ (Sukumar) దర్శకుడు. ‘పుష్ప ది రైజ్‌’కు సీక్వెల్‌గా వస్తోన్న ఈసినిమా నుంచి ఆసక్తికర అప్‌డేట్‌ వచ్చేసింది. ‘వేర్‌ ఈజ్‌ పుష్ప’ (where is pushpa) పేరుతో విడుదలైన ఈ వీడియోలో.. తిరుపతి జైలు నుంచి బుల్లెట్‌ గాయాలతో ‘పుష్ప’రాజ్‌ తప్పించుకున్నట్లు చూపించారు. ఆయన కోసం ఓవైపు పోలీసులు గాలింపు ప్రారంభించడం.. మరోవైపు ఊరి వాళ్లు నిరసనలు చేస్తున్నట్లు ఇందులో చూడొచ్చు. మరి ‘పుష్ప’ ఎక్కడికి వెళ్లాడు? అసలు ఆయన ఎందుకు పారిపోయాడు? అనేది తెలియాలంటే మరో రెండు రోజులు వేచి ఉండాలని చిత్ర నిర్మాణ సంస్థ పేర్కొంది. ఈ మేరకు ఏప్రిల్‌ 7న సాయంత్రం 4.05 గంటలకు ‘పుష్ప’రాజ్‌ అప్‌డేట్‌ ఇవ్వనున్నట్లు వెల్లడించింది.

శ్రీవల్లి కూడా వచ్చేసింది..!

‘పుష్ప’ సినిమాలో రష్మిక (Rashmika) కథానాయికగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. మొదటి భాగంలో శ్రీవల్లిగా గ్రామీణ యువతి పాత్రలో ఆమె అలరించింది. బుధవారం ఆమె పుట్టినరోజును పురస్కరించుకుని చిత్రబృందం సరికొత్త పోస్టర్‌ షేర్‌ చేసింది. ఇందులో ఆమె లంగావోణీ ధరించి క్యూట్‌ లుక్స్‌లో కనిపించారు. ఎర్ర చందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో ‘పుష్ప’ తెరకెక్కింది. ఇప్పటికే విడుదలైన మొదటి భాగం పాన్‌ ఇండియాలో సక్సెస్‌ సాధించింది. ప్రస్తుతం రెండో పార్ట్‌ షూట్‌ జరుగుతోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని