Updated : 01 Jul 2022 06:47 IST

Liger: ఉల్లాసంగా... ఉత్సాహంగా

‘లైగర్‌’ (Liger) కోసం కెమెరా ముందుకొచ్చారు ప్రఖ్యాత బాక్సర్‌... మైక్‌టైసన్‌ (Mike Tyson). ఆయన తెరపై ఎలా సందడి చేశారో తెలియాలంటే ఆగస్టు 25 వరకు ఆగాల్సిందే. పూరి జగన్నాథ్‌(Puri Jagannadh) దర్శకత్వంలో... విజయ్‌ దేవరకొండ(Vijay Devarakonda) కథానాయకుడిగా నటించిన చిత్రమిది. అనన్యపాండే(Ananya Pandey) కథానాయిక. ఛార్మికౌర్‌, కరణ్‌జోహార్‌, అపూర్వ మెహతాతో కలిసి పూరి జగన్నాథ్‌ నిర్మిస్తున్నారు. దక్షిణాది భాషలతో పాటు హిందీలో చిత్రం విడుదలవుతోంది. మైక్‌టైసన్‌ పుట్టినరోజుని పురస్కరించుకుని గురువారం ఓ వీడియోని విడుదల చేసింది చిత్రబృందం. టైసన్‌ నవ్వుతూ, నవ్విస్తూ సెట్లో  సరదాగా గడుపుతుండగా తీసిన ఆ వీడియోలో చిత్రబృందం అంతా ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పింది. ‘లైగర్‌’ మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ ప్రధానంగా రూపొందుతోంది.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని