The test: వేసవికి థియేటర్లలో టెస్ట్‌ మ్యాచ్‌

చెన్నైలో జరిగిన ఒక ఓ అంతర్జాతీయ టెస్ట్‌ క్రికెట్‌ మ్యాచ్‌ ముగ్గురు వ్యక్తుల జీవితాలను ఎలా ప్రభావితం చేసిందనే కథనంతో స్పోర్ట్స్‌ డ్రామాగా రూపొందిన చిత్రమే ‘టెస్ట్‌’. ఎస్‌.శశికాంత్‌ దర్శకత్వంలో తెరకెక్కనుంది. వైనాట్‌ స్టూడియోస్‌ పతాకంపై చక్రవర్తి రామచంద్ర, శశికాంత్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Updated : 02 Feb 2024 09:31 IST

చెన్నైలో జరిగిన ఒక ఓ అంతర్జాతీయ టెస్ట్‌ క్రికెట్‌ మ్యాచ్‌ ముగ్గురు వ్యక్తుల జీవితాలను ఎలా ప్రభావితం చేసిందనే కథనంతో స్పోర్ట్స్‌ డ్రామాగా రూపొందిన చిత్రమే ‘టెస్ట్‌’. ఎస్‌.శశికాంత్‌ దర్శకత్వంలో తెరకెక్కనుంది. వైనాట్‌ స్టూడియోస్‌ పతాకంపై చక్రవర్తి రామచంద్ర, శశికాంత్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కుముధ పాత్రలో నయనతార, క్రికెటర్‌ అర్జున్‌గా సిద్ధార్థ్‌ కనిపించగా ఆర్‌.మాధవన్‌, మీరా జాస్మిన్‌ తదితర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా చిత్రీకరణను పూర్తిచేసుకున్నట్లు నయన సామాజిక మాధ్యమాల వేదికగా వీడియోను పంచుకుంది. ‘జీవితాన్ని ఆడించే ‘టెస్ట్‌’ ఆట ముగిసింది. ఈ వేసవికి థియేటర్లలో కలుద్దాం!’ అంటూ వ్యాఖ్యల్ని జోడించింది. ‘తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో వేసవిలో ఈ ‘టెస్ట్‌’ ఆటను చూడాల్సిందే’నని అంటున్నాయి సన్నిహిత వర్గాలు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు