Madhubala: భావోద్వేగాల ‘ప్రేమదేశం’
త్రిగుణ్ (Thrigun), మేఘా ఆకాష్ (Megha Akash) జంటగా శ్రీకాంత్ సిద్ధమ్ తెరకెక్కించిన చిత్రం ‘ప్రేమదేశం’ (Prema Desam). శిరీష సిద్ధమ్ నిర్మాత. మధుబాల, అజయ్ కతుర్వార్ కీలక పాత్రలు పోషించారు.
త్రిగుణ్ (Thrigun), మేఘా ఆకాష్(Megha Akash) జంటగా శ్రీకాంత్ సిద్ధమ్ తెరకెక్కించిన చిత్రం ‘ప్రేమదేశం’ (Premadesam). శిరీష సిద్ధమ్ నిర్మాత. మధుబాల (Madhubala), అజయ్ కతుర్వార్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఈనెల 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఇటీవల హైదరాబాద్‌లో విడుదల ముందస్తు వేడుక నిర్వహించారు. అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, దర్శకుడు శైలేష్ కొలను తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హీరో త్రిగుణ్ మాట్లాడుతూ.. ‘‘కథ విన్నప్పుడే చాలా ఎగ్జైటింగ్‌గా అనిపించింది. అందుకే స్క్రిప్ట్ వినగానే చేస్తానని చెప్పా. సంగీతపరంగా ఈ చిత్రం మంచి స్థాయిలో ఉంటుంది. ఇలాంటి చక్కని చిత్రంలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు’’ అన్నారు. ‘‘కొత్తదనం నిండిన ప్రేమకథతో రూపొందిన చిత్రమిది. ఇందులో మధుబాల నటించడంతో మా సినిమా మరో స్థాయికి వెళ్లింది. త్రిగుణ్, శివ, అజయ్ తదితరులంతా చాలా బాగా చేశారు. తప్పకుండా ఈ సినిమా ప్రేక్షకులు అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నా’’ అన్నారు దర్శకుడు శ్రీకాంత్. నటుడు అజయ్ కతుర్వార్ మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమాలో మంచి ఎమోషన్ ఉంది. అప్పటి బ్లాక్‌బస్టర్ హిట్ ‘ప్రేమదేశం’ పేరుతో వస్తున్న ఈ సినిమా ఆ చిత్రానికి ఏమాత్రం తగ్గకుండా ఉంటుంది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో మధుబాల, శివ, రఘు కల్యాణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
YSRCP: అన్నీ ఒట్టి మాటలేనా?.. వైకాపా ఎమ్మెల్యేకు నిరసన సెగ
-
Sports News
Ashwin: మాది బలమైన జట్టు..విమర్శలపై ఘాటుగా స్పందించిన అశ్విన్
-
World News
Pakistan: మా దేశంలో ఎన్నికలా.. కష్టమే..!
-
Movies News
Ram gopal varma: ఆర్జీవీ నా ఫస్ట్ ఆస్కార్ అన్న కీరవాణి.. వర్మ రిప్లై ఏంటో తెలుసా?
-
General News
Harish rao: కొత్త వైద్య కళాశాలల నిర్మాణ పనులు వేగవంతం చేయాలి: హరీశ్‌రావు
-
Politics News
Rahul Gandhi: ‘వాజ్‌పేయీ మాటలను గుర్తుతెచ్చుకోండి’.. అనర్హత వేటుపై ప్రశాంత్ కిశోర్!