MaheshBabu: రామోజీ ఫిల్మ్‌సిటీలో... మహేష్‌ యాక్షన్‌

పోరాట ఘట్టంతో ఇటీవలే హైదరాబాద్‌లో మొదలైంది మహేష్‌బాబు - త్రివిక్రమ్‌ సినిమా. అభిమానుల్ని ఎప్పట్నుంచో ఊరిస్తున్న ఈ చిత్రం యాక్షన్‌ ప్రధానంగా రూపొందుతోంది.

Updated : 19 Sep 2022 09:03 IST

పోరాట ఘట్టంతో ఇటీవలే హైదరాబాద్‌లో మొదలైంది మహేష్‌బాబు (MaheshBabu) - త్రివిక్రమ్‌ (Trivikram) సినిమా. అభిమానుల్ని ఎప్పట్నుంచో ఊరిస్తున్న ఈ చిత్రం యాక్షన్‌ ప్రధానంగా రూపొందుతోంది. కొన్ని కీలకమైన పోరాట ఘట్టాల్ని తాజాగా రామోజీ ఫిల్మ్‌సిటీలో తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ యాక్షన్‌ కొరియోగ్రాఫర్లు అన్బరివ్‌ ఈ సన్నివేశాలకి నేతృత్వం వహిస్తున్నారు. మహేష్‌, ఇతర తారాగణం పాల్గొంటోంది. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌.రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్న ఈ చిత్రం మహేష్‌ - త్రివిక్రమ్‌ కలయికలో వస్తున్న  మూడో సినిమా. పూజాహెగ్డే కథానాయికగా నటిస్తోంది. తమన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని