Rashmika: రష్మిక ‘డీప్‌ ఫేక్‌’ కేసు.. కీలక నిందితుడి అరెస్టు!

రష్మిక డీప్‌ఫేక్‌ వీడియో కేసులో కీలక నిందితుడిని దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.

Updated : 20 Jan 2024 19:07 IST

దిల్లీ: ప్రముఖ సినీనటి రష్మిక (Rashmika Mandanna) డీప్‌ఫేక్‌ వీడియో కేసులో ఏపీలోని గుంటూరుకు చెందిన ఈమని నవీన్‌ (24)ను అరెస్టు చేసినట్లు దిల్లీ డీసీపీ హేమంత్‌ తివారీ వెల్లడించారు. అతడే ఈ వీడియో సృష్టించినట్లు అనుమానాలు ఉన్నాయన్నారు. నిందితుడి నుంచి ల్యాప్‌టాప్‌, మొబైల్‌ స్వాధీనం చేసుకొని, విచారిస్తున్నట్లు చెప్పారు. డిలీట్‌ చేసిన డేటాను పునరుద్ధరించేందుకు యత్నిస్తున్నామన్నారు. రష్మిక పేరుతో కొన్నాళ్లు ఫ్యాన్స్‌ పేజీని నడిపిన నిందితుడు.. ఫాలోవర్ల సంఖ్యను పెంచుకునేందుకే ఈ వీడియో రూపొందించినట్లు డీసీపీ తెలిపారు. మరో ఇద్దరు ప్రముఖుల పేర్లతోనూ ఫ్యాన్స్‌ పేజీలను నడిపినట్లు పోలీసులు గుర్తించారు.

Deepfake: రష్మిక.. కత్రిన.. తర్వాత మనమేనా?

సోషల్‌ మీడియా తార జారా పటేల్‌ వీడియోకు రష్మిక ముఖాన్ని ఉపయోగించిన విషయం తెలిసిందే. చూడటానికి అభ్యంతరకరంగా ఉన్న ఆ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. టెక్నాలజీని చూస్తుంటే భయంగా ఉందంటూ రష్మిక ఆవేదన చెందారు. దిల్లీ మహిళా కమిషన్‌ నుంచి పోలీసులకు నోటీసులు అందాయి. గతేడాది నవంబరు 10న ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని