Manchu Vishnu: రష్మిక డీప్‌ఫేక్‌ వీడియో.. ‘మా’ అధ్యక్షుడి ట్వీట్‌

సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారిన రష్మిక (Rashmika) డీప్‌ఫేక్‌ వీడియోపై ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు (Manchu Vishnu) స్పందించారు. ఈ మేరకు బుధవారం ఆయన ట్వీట్‌ చేశారు.

Published : 08 Nov 2023 16:28 IST

హైదరాబాద్‌: రష్మిక (Rashmika) డీప్‌ ఫేక్‌ వీడియో వివాదంపై మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు, నటుడు మంచు విష్ణు (Manchu Vishnu) స్పందించారు. సాంకేతికతను ఉపయోగించి ఇలాంటి ఇబ్బందికర వీడియోలు క్రియేట్‌ చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. ‘‘డీప్ ఫేక్ కాంట్రవర్సీకు గురైన రష్మికకు నా మద్దతు తెలియజేస్తున్నా. సాంకేతికతను దుర్వినియోగం చేసి ఇలాంటి హానికరమైన కంటెంట్‌ను క్రియేట్‌ చేయడంపై మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇలాంటి ఘటనలపై పోరాడేందుకు అవసరమైన మార్గదర్శకాలు రూపొందించే దిశగా ఏఐ, న్యాయ నిపుణులతో ‘మా’ సంప్రదింపులు జరుపుతోంది.

KTR: ఇదొక అవమానకరమైన చర్య: డీప్‌ఫేక్‌ వీడియోపై కేటీఆర్‌

ఫేక్‌ వీడియోలపై తక్షణమై స్పందించాల్సిన అవసరం ఉందని రష్మికకు ఎదురైన ఘటన తెలియజేస్తోంది. ఏఐ టెక్నాలజీ సాయంతో నటీనటుల రక్షణకు భంగం కలిగించే ఇలాంటి వీడియోలను ‘మా’ ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించదు. ఈ విషయంపై చర్యలు తీసుకునే దిశగా ఇప్పటికే ఇరుగుపొరుగు సినీపరిశ్రమలను సంప్రదించడం జరిగింది. పరిశ్రమలోని ప్రతి ఒక్కరి గౌరవాన్ని కాపాడేందుకు మేము అంకితభావంతో పనిచేస్తున్నాం’’ అని విష్ణు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని