Masooda: భయపెట్టే ‘మసూద’

సంగీత, తిరువీర్‌, కావ్య కల్యాణ్‌రామ్‌ ప్రధాన పాత్రల్లో సాయికిరణ్‌ తెరకెక్కించిన చిత్రం ‘మసూద’. రాహుల్‌ యాదవ్‌ నక్కా నిర్మించారు. శుభలేఖ సుధాకర్‌, సత్య ప్రకాష్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా శుక్రవారం విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే గురువారం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు.

Updated : 18 Nov 2022 06:58 IST

సంగీత, తిరువీర్‌, కావ్య కల్యాణ్‌రామ్‌ ప్రధాన పాత్రల్లో సాయికిరణ్‌ తెరకెక్కించిన చిత్రం ‘మసూద’ (Masooda). రాహుల్‌ యాదవ్‌ నక్కా నిర్మించారు. శుభలేఖ సుధాకర్‌, సత్య ప్రకాష్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా శుక్రవారం విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే గురువారం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. దీనికి వెంకటేశ్‌ మహా, వివేక్‌ ఆత్రేయ, ఆర్‌.ఎస్‌.జె.స్వరూప్‌ తదితరులు అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వెంకటేష్‌ మహా మాట్లాడుతూ.. ‘‘హారర్‌ జానర్‌ తీయాలన్న ఆసక్తి లేదని ఇప్పుడున్న దర్శకులు అంటున్నారు. నేను కూడా ఆ మాట అన్నా. కానీ, నేను ఈ చిత్రాన్ని రెండు సార్లు చూశా. చాలా భయపడ్డాను. సాయి అంత అద్భుతంగా సినిమా తెరకెక్కించారు’’ అన్నారు. ‘‘అమ్మోరు’, ‘కాంతార’ ప్రపంచంలో ఉన్నప్పుడు.. ఆ పాత్రలకు ఏమైనా జరుగుతూ ఉంటే మనం భయపడతాం. ఈ చిత్రం చూస్తున్నప్పుడూ అలాంటి అనుభూతే లభిస్తుంది’’ అన్నారు దర్శకుడు వివేక్‌ ఆత్రేయ. నటుడు తిరువీర్‌ మాట్లాడుతూ.. ‘‘ఈ కథ విన్నాక.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ అవకాశం వదులుకోకూడదనిపించింది. ఇంత మంచి పాత్ర నాకు ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు. ‘‘మంచి సినిమా తీశాం. ప్రతి ఒక్కరికీ నచ్చుతుందని నమ్ముతున్నాం. ఇది కల్పిత చిత్రమే. ఇందులో మసూద నెగటివ్‌ పాత్ర. ఆమె కోణంలో నుంచే సినిమా నడుస్తుంది కాబట్టి ఆ పేరునే టైటిల్‌గా పెట్టాం’’ అన్నారు దర్శకుడు సాయికిరణ్‌. ఈ కార్యక్రమంలో ప్రశాంత్‌ ఆర్‌.విహారి, క్రాంతి తదితరులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని