Niharika Konidela: ఇప్పటివరకూ ఆ అవకాశం రాలేదు: నిహారిక కొణిదెల

మెగా డాటర్‌ నిహారిక కొణిదెల కమర్షియల్‌ సినిమా అవకాశాల గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.

Published : 11 Mar 2024 16:20 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: యాంకర్‌గా, నటిగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటి నిహారిక కొణిదెల తనకు ఇప్పటివరకూ కమర్షియల్‌ సినిమాల్లో నటించే అవకాశం రాలేదన్నారు. కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న ఆమె ‘వాట్‌ ది ఫిష్‌’ చిత్రంతో మళ్లీ తెరపైకి రానున్నారు. వరుణ్‌ కోరుకొండ దర్శకుడిగా పరిచయం కానున్నారు. తాజాగా ఆమె ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ ఆహాలో ప్రసారం కానున్న ‘చెఫ్‌ మంత్రా’ షోలో యాంకర్‌గా అలరించేందుకు సిద్ధమయ్యారు. ఈనేపథ్యంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడారు.

 ‘‘ప్రస్తుతానికి వచ్చిన డబ్బులు ఆదా చేసుకుంటూ నాకు నచ్చిన ప్రదేశానికి ట్రావిలింగ్‌ చేస్తున్నా. ప్లానింగ్‌ అంటూ ఏం ఉండదు. నాకు నచ్చిన ప్రదేశాలకు వెళ్లిపోతుంటా. టర్కీ, కెన్యా వంటి ప్రదేశాలకు వెళ్లడమంటే ఇష్టం. ఇక సినిమాల విషయానికి వస్తే ఇప్పటివరకూ నాకు కమర్షియల్ మూవీస్‌ చేసే అవకాశం రాలేదు. డైరెక్టర్స్‌ అలాంటి కథ చెప్పలేదు. ఎవరైనా అడిగితే  కచ్చితంగా నటిస్తాను. ఆడిషన్స్‌ ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నా. పెద్ద కుటుంబం నుంచి వచ్చాను.. ఎందుకు ఆడిషన్స్‌ ఇవ్వాలి అనుకోవడం లేదు. ఆహాలో రానున్న చెఫ్‌ మంత్రా షోకి హోస్ట్‌గా చేస్తున్నా. ఇందులో పెద్దమ్మ సురేఖ, వదిన ఉపాసనలతో వంట చేయించాలని ప్రయత్నిస్తున్నా. చూద్దాం ఏం జరుగుతుందో. డిస్నీ+ హాట్‌స్టార్‌, జీ5 వాటిలో ప్రసారం అయ్యే వివిధ షోలు చేశాను’’ అని నిహారిక తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని