Miss Shetty Mr Polishetty: మిస్‌... మిస్టర్‌ సందడి

అనుష్క, నవీన్‌ పొలిశెట్టి ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న చిత్రం ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’. మహేశ్‌బాబు.పి దర్శకత్వం వహిస్తున్నారు. యు.వి.క్రియేషన్స్‌ పతాకంపై వంశీ, ప్రమోద్‌ నిర్మిస్తున్నారు.

Updated : 20 Aug 2023 14:10 IST

నుష్క, నవీన్‌ పొలిశెట్టి ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న చిత్రం ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’. మహేశ్‌బాబు.పి దర్శకత్వం వహిస్తున్నారు. యు.వి.క్రియేషన్స్‌ పతాకంపై వంశీ, ప్రమోద్‌ నిర్మిస్తున్నారు. సెప్టెంబరు 7న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నెల 21న ట్రైలర్‌ని విడుదల చేస్తున్నట్టు శనివారం చిత్రబృందం తెలిపింది. నవీన్‌ పొలిశెట్టి ఇందులో స్టాండప్‌ కమెడియన్‌ పాత్రలో నటిస్తుండగా, అనుష్క చెఫ్‌గా కనిపిస్తారు. అభినవ్‌ గోమటం, మురళీశర్మ, తులసి తదితరులు నటించిన ఈ చిత్రాన్ని తెలుగుతోపాటు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని