మోనాల్‌ గజ్జర్‌ చిందేసిన ఐటమ్‌ సాంగ్‌ చూశారా?

‘రంభ.. ఊర్వశి.. మేనక.. అందరినీ కలిపేస్తే నేనిక’ అంటోంది మోనాల్‌ గజ్జర్‌. బెల్లకొండ శ్రీనివాస్‌ కథానాయకుడిగా నటించిన

Published : 13 Jan 2021 01:29 IST

హైదరాబాద్‌: ‘రంభ.. ఊర్వశి.. మేనక.. అందరినీ కలిపేస్తే నేనిక..’ అంటోంది మోనాల్‌ గజ్జర్‌. బెల్లకొండ శ్రీనివాస్‌ కథానాయకుడిగా నటించిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘అల్లుడు అదుర్స్‌’. నభానటేశ్‌ కథానాయిక. సంతోష్‌ శ్రీనివాస్‌ దర్శకత్వం వహించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇందులో ఓ ఐటమ్‌ సాంగ్‌లో హీరోయిన్‌, బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ మోనాల్‌ గజ్జర్‌ ఆడిపాడింది. దేవిశ్రీ అందించిన స్వరాలకు శ్రీమణి సాహిత్యం అందించారు. మంగ్లీ, హేమచంద్ర ఆలపించారు. ప్రస్తుతం యూట్యూబ్‌లో ఈ సాంగ్‌ ట్రెండింగ్‌లో ఉంది. మరి దేవిశ్రీ బీట్‌కు మోనాల్‌, శ్రీనివాస్‌లు ఎలా ఆడి పాడారో చూడాలంటే థియేటర్‌కు వెళ్లాల్సిందే. అప్పటివరకూ ఈ లిరికల్‌ వీడియోను చూసేయండి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని