Mrunal Thakur: గ్లామర్ పాత్రలకు పనికి రానన్నారు: మృణాల్ ఠాకూర్

కెరీర్‌ తొలినాళ్లలో ఎదురైన చేదు అనుభవాన్ని మృణాల్‌ ఠాకూర్‌ గుర్తుచేసుకున్నారు.

Updated : 10 Feb 2024 11:17 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘సీతారామం’తో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో మంచి స్థానాన్ని సొంతం చేసుకున్నారు మృణాల్‌ ఠాకూర్‌. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. కెరీర్‌ ప్రారంభంలో ఎదురైన చేదు అనుభవాలను తాజా ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్నారు.

‘నాకు బాలీవుడ్‌లోనూ వరుస అవకాశాలు వస్తున్నాయి. సౌత్‌లో వస్తోన్న మంచి పాత్రలు మాత్రం అక్కడ రావడం లేదు. వాటిలో నటించేందుకు ఆసక్తిగా లేను. నన్ను నేను నిరూపించుకునే సినిమాల్లో నటించాలని నా కోరిక. తల్లి, అక్క పాత్రలను పోషించాల్సి వచ్చినా భయపడను. సంవత్సరానికి ఐదు సినిమాల్లో నటించాలనే లక్ష్యం ఏం లేదు. చేసిన ఒక్క సినిమా అయినా ప్రేక్షకులకు గుర్తుండిపోతే చాలు. నేను పరిశ్రమలోకి వచ్చిన తొలినాళ్లలో కొందరు నా శరీరాకృతిపై కామెంట్స్‌ చేశారు. గ్లామర్‌ రోల్స్‌కు పనికిరానన్నారు. ఓ సినిమా ఆడిషన్స్‌లో ఫొటోగ్రాఫర్‌ నన్ను చూసి ‘ఈ పల్లెటూరి అమ్మాయి ఎవరు?’ అన్నాడు. ఇలాంటి అనుభవాలు ఎన్నో ఎదుర్కొన్నాను’ అని మృణాల్ అన్నారు.

మహేశ్‌బాబు తనయ సితార పేరుతో ఇన్వెస్ట్‌మెంట్‌ లింకులు.. స్పందించిన జీఎంబీ

సినిమాల విషయానికొస్తే.. ఇటీవలే ‘హాయ్‌ నాన్న’తో హిట్‌ను అందుకున్న మృణాల్‌ ప్రస్తుతం ‘ఫ్యామిలీ స్టార్’ (Family Star)లో నటిస్తున్నారు. విజయ్‌ దేవరకొండ (Vijay devarakonda) కథానాయకుడిగా పరశురామ్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రమిది. ‘గీత గోవిందం’ తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్‌లో వస్తోన్న సినిమా కావడంతో దీనిపై అంచనాలున్నాయి. ఏప్రిల్‌ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదల చేసిన పాటలు ప్రేక్షకాదరణ పొందాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని