Naresh: ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం

అల్లరి నరేష్‌ అనగానే హాస్య ప్రధానమైన కథలే గుర్తుకొస్తాయి. ఆయన అప్పుడప్పుడూ గాఢమైన భావోద్వేగాలు నిండిన కథల్లోనూ నటించి మెప్పించారు. ‘విశాఖ ఎక్స్‌ప్రెస్‌’, ‘గమ్యం’, ‘నాంది’ తదితర చిత్రాలు....

Updated : 11 Apr 2022 09:25 IST

ల్లరి నరేష్‌ అనగానే హాస్య ప్రధానమైన కథలే గుర్తుకొస్తాయి. ఆయన అప్పుడప్పుడూ గాఢమైన భావోద్వేగాలు నిండిన కథల్లోనూ నటించి మెప్పించారు. ‘విశాఖ ఎక్స్‌ప్రెస్‌’, ‘గమ్యం’, ‘నాంది’ తదితర చిత్రాలు ఆయన ఎంపిక చేసుకున్న కథల్లోని వైవిధ్యతని చాటి చెబుతాయి. మరోసారి అలాంటి ఓ విభిన్నమైన కథతో ఆయన 59వ చిత్రం చేస్తున్నారు. ఆనంది  కథానాయిక. జీ స్టూడియోస్‌  సమర్పణలో, హాస్య మూవీస్‌ సంస్థ నిర్మిస్తోంది. ఎ.ఆర్‌.మోహన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. రాజేష్‌ దండు నిర్మాత. దీనికి ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ అనే పేరుని ఖరారు చేశారు. వెన్నెల కిషోర్‌, ప్రవీణ్‌ ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: అబ్బూరి రవి, సంగీతం: శ్రీచరణ్‌ పాకాల, ఛాయాగ్రహణం: రామ్‌రెడ్డి, కూర్పు: ఛోటా కె.ప్రసాద్‌, ప్రొడక్షన్‌ డిజైన్‌: బ్రహ్మ కడలి, పోరాటాలు: పృథ్వీ.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని