Nayanthara: ‘కుముధ..’ ఓ అందమైన పాత్ర

గతేడాది ‘జవాన్‌’తో పాన్‌ ఇండియా స్టార్‌గా పేరు తెచ్చుకుంది అగ్రకథానాయిక నయనతార. తన 75వ చిత్రం ‘అన్నపూరణి’ అంతంత మాత్రం అనిపించినా మంచి స్పందననే సొంతం చేసుకుంది.

Updated : 09 Jan 2024 09:26 IST

తేడాది ‘జవాన్‌’తో పాన్‌ ఇండియా స్టార్‌గా పేరు తెచ్చుకుంది అగ్రకథానాయిక నయనతార. తన 75వ చిత్రం ‘అన్నపూరణి’ అంతంత మాత్రం అనిపించినా మంచి స్పందననే సొంతం చేసుకుంది. ఈ ఏడాది ‘టెస్ట్‌’తో అలరించేందుకు సిద్ధమవుతోంది. ఆర్‌.మాధవన్‌, సిద్ధార్థ్‌ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్‌. శశికాంత్‌ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. స్పోర్ట్స్‌ డ్రామా నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో కుముధ అనే పాత్రలో నయన కనిపించనుంది. తాజాగా తన షెడ్యూల్‌ని కూడా పూర్తిచేసుకుంది. ఆ విషయాన్ని ఆమె సామాజిక మాధ్యమాల వేదికగా తెలుపుతూ ఫొటోలను పంచుకుంది. ‘కుముధ...నా జీవితంలోకి ఓ పాత్రలా వచ్చినందుకు   ధన్యవాదాలు. ఈ పాత్రను ఇంత అందంగా తీర్చిదిద్దిన దర్శకుడు శశి, కుముధకు అండగా నిలిచిన మాధవన్‌, స్ఫూర్తినిచ్చిన సిద్ధార్థ్‌... అందరికీ చాలా థాంక్యూ. ‘టెస్ట్‌’ ద్వారా మా ప్రేమను చూపించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము’ అంటూ వ్యాఖ్యల్ని జోడించింది నయన.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని