Nenu Student Sir: ఒక్క శాతం కూడా అలా అనిపించదు

‘‘మంచి థియేటర్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఇచ్చే చిత్రం ‘నేను స్టూడెంట్‌ సర్‌’’ అంటున్నారు బెల్లంకొండ గణేష్‌. ఆయన హీరోగా రాకేష్‌ ఉప్పలపాటి తెరకెక్కించిన ఈ చిత్రాన్ని సతీష్‌ వర్మ నిర్మించారు.

Updated : 02 Jun 2023 12:54 IST

‘‘మంచి థియేటర్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఇచ్చే చిత్రం ‘నేను స్టూడెంట్‌ సర్‌’ (Nenu Student Sir) అంటున్నారు బెల్లంకొండ గణేష్‌ (Bellamkonda Ganesh). ఆయన హీరోగా రాకేష్‌ ఉప్పలపాటి తెరకెక్కించిన ఈ చిత్రాన్ని సతీష్‌ వర్మ నిర్మించారు. అవంతిక దస్సాని కథానాయిక. ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో గురువారం విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బెల్లంకొండ గణేష్‌ మాట్లాడుతూ.. ‘‘చాలా మంచి నటీనటులు, సాంకేతిక నిపుణులు కలిసి ఎంతో ఇష్టంగా ఈ చిత్రం చేశాం. దీన్ని థియేటర్‌కు వచ్చి చూస్తే థ్రిల్‌గా ఫీలవుతారు. ఆద్యంతం తర్వాత ఏం జరుగుతుందనే ఉత్సుకత రేకెత్తిస్తుంది’’ అన్నారు. ‘‘ఈ చిత్రం చూస్తున్నప్పుడు టికెట్‌ డబ్బులు, రెండు గంటల సమయం వృథా చేశామని ఒక్క శాతం కూడా అనిపించదు’’ అన్నారు దర్శకుడు రాకేష్‌. ఈ కార్యక్రమంలో నిర్మాత సతీష్‌ వర్మ, కృష్ణ చైతన్య, రతిక, యశ్వంత్‌, అనిత్‌, రాంప్రసాద్‌, కార్తీక్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని