Nijam with Smita: ఒకే వేదికపై రియల్ మేజర్, రీల్ ‘మేజర్’.. ఏం చెప్పారంటే?
యంగ్ హీరో అడివి శేష్, మేజర్ భరత్‌రెడ్డి కలిసి ‘నిజం విత్ స్మిత’ కార్యక్రమంలో పాల్గొన్నారు. వ్యాఖ్యాత స్మితతో పలు ఆసక్తికర సంగతులు పంచుకున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: 26/11 ముంబయి ఉగ్రదాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితాధారంగా తెరకెక్కిన ‘మేజర్’ చిత్రంలో నటించి స్ఫూర్తినింపిన నటుడు అడివి శేష్ (Adivi Sesh). ఆ పాత్రలో ఒదిగిపోయి రీల్ మేజర్‌గా గుర్తింపు పొందిన ఈయన.. మేజర్ భరత్‌రెడ్డితో కలిసి ‘నిజం విత్ స్మిత’ (Nijam with Smita) కార్యక్రమంలో పాల్గొన్నారు. తాను ఎదుర్కొన్న సవాళ్లు, జవాను కుటుంబాలు చేసే త్యాగం, యుద్ధ కథల గురించి భరత్‌రెడ్డి వివరించారు. ‘సైనికుడంటే డెమోక్రసీలో ఉంటూ దాన్ని కాపాడాలే తప్ప అది ఎలా పనిచేస్తుందో చూడకూడదు’ అని తనకెవరో చెప్పిన మాటను గుర్తుచేసుకున్నారు. ‘మేజర్’ చిత్రంలోని ప్రతి సన్నివేశం వాస్తవానికి దగ్గరగా ఉంటుందని శేష్ తెలిపారు.
ప్రముఖ పాప్ సింగర్ స్మిత వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న షో ఇది. ఇప్పటికే పలువురు ప్రముఖులను ఇంటర్వ్యూ చేసిన ఆమె తాజాగా అడివి శేష్, భరత్‌రెడ్డితో ముచ్చటించారు. ఓటీటీ ‘సోనీలివ్’లో ఈ నెల 24న ప్రసారంకానున్న ఈ ఎపిసోడ్ ప్రోమో బుధవారం విడుదలైంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Supreme Court: రూ.2వేల నోట్ల మార్పిడిపై పిటిషన్.. అత్యవసర విచారణకు సుప్రీం ‘నో’!
-
Movies News
Samantha: విజయ్.. నీ కష్టసుఖాలు నేను చూశా: సమంత
-
India News
Bhagwant Mann: ‘మా పోలీసులు చూసుకోగలరు’: జెడ్ ప్లస్ భద్రత వద్దన్న సీఎం
-
General News
TSRTC: టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు తీపి కబురు
-
Crime News
Hayathnagar: రాజేష్ శరీరంపై ఎలాంటి గాయాల్లేవు.. వివరాలు వెల్లడించిన రాచకొండ సీపీ
-
Movies News
Allu Aravind: మా వల్ల పైకొచ్చిన వాళ్లు వెళ్లిపోయారు.. ఆ ఒక్క దర్శకుడే మాటకు కట్టుబడ్డాడు!