Nithiin: విశాల్‌ ఈసారి తప్పకుండా హిట్‌ కొడతాడు.. గుర్తుపెట్టుకోండి: నితిన్‌

విశాల్‌, ఎస్‌.జె. సూర్య ప్రధాన పాత్రల్లో దర్శకుడు అధిక్‌ రవిచంద్రన్‌ తెరకెక్కించిన చిత్రం ‘మార్క్‌ ఆంటొని’. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు నితిన్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Published : 11 Sep 2023 02:36 IST

హైదరాబాద్‌: విశాల్‌ (Vishal) తనకు మంచి మిత్రుడని, ఆయన ఈసారి ‘మార్క్‌ ఆంటొని’ (Mark Antony) చిత్రంతో తప్పకుండా పెద్ద హిట్‌ కొడతారని నితిన్‌ అన్నారు. ఆ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడారు. విశాల్‌, ఎస్‌.జె. సూర్య (S J Suryah) ప్రధాన పాత్రల్లో దర్శకుడు అధిక్‌ రవిచంద్రన్‌ (Adhik Ravichandran) తెరకెక్కించిన చిత్రమిది. సెప్టెంబరు 15న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం హైదరాబాద్‌లోని జె.ఆర్‌.సి. కన్వెషన్స్‌లో ఈవెంట్‌ నిర్వహించింది.

మంచు విష్ణు డ్రీమ్‌ ప్రాజెక్ట్‌.. శివుడిగా ప్రభాస్‌..?

‘‘ఈ సినిమా పోస్టర్లు, ప్రచార చిత్రాలు చాలా క్రేజీగా ఉన్నాయి. ఎస్‌.జె. సూర్య సర్‌లోని దర్శకుడు, నటుడికి నేను పెద్ద అభిమానిని. ఆయన టైమింగ్‌ నాకు బాగా నచ్చుతుంది. విశాల్‌ నాకు మంచి స్నేహితుడు. ఈ సినిమా పెద్ద విజయం అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈసారి తప్పకుండా హిట్‌ కొడతాడు. నా మాట గుర్తుపెట్టుకోండి. సెప్టెంబరు 15.. విశాల్‌ డే. ఈ సినిమా టీమ్‌కి అడ్వాన్స్‌ కంగ్రాట్స్‌. ఈ సినిమా బాగుందని ఇప్పటికే టాక్‌ వచ్చింది. అందుకే అంత నమ్మకంతో ఈ మాట చెబుతున్నా’’ అని నితిన్‌ అన్నారు. విశాల్‌ మాట్లాడుతూ.. ‘‘నాకు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో తమ్ముడు ఉంటాడు. ఇక్కడ నా తమ్ముడు నితిన్‌. అడిగిన వెంటనే ఈ వేడుకకు వస్తానని చెప్పాడు. నాకోసమే వచ్చాడు. నా మనసుకు దగ్గరైన మనిషి ఈ ఈవెంట్‌లో భాగమవడం చాలా సంతోషంగా ఉంది’’ అని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని