NTR 30: సందడి.. 2024లో

ధైర్యం ఒక వ్యాధిగా మారినప్పుడు... భయమే విరుగుడు అవుతుందట. మరి ఆ కథేమిటో తెలియాలంటే ఎన్టీఆర్‌ 30వ చిత్రం విడుదల వరకు ఎదురు చూడాల్సిందే.

Updated : 02 Jan 2023 06:46 IST

ధైర్యం ఒక వ్యాధిగా మారినప్పుడు... భయమే విరుగుడు అవుతుందట. మరి ఆ కథేమిటో తెలియాలంటే ఎన్టీఆర్‌ 30వ (NTR 30) చిత్రం విడుదల వరకు ఎదురు చూడాల్సిందే. కొత్త ఏడాది  ఆరంభాన్ని పురస్కరించుకుని విడుదల తేదీని కూడా ప్రకటించాయి సినీవర్గాలు. కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమాని 2024 ఏప్రిల్‌ 5న ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. ఫిబ్రవరి నుంచి చిత్రీకరణ మొదలవుతుంది. యువ సుధ ఆర్ట్స్‌ పతాకంపై సుధాకర్‌ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్‌కి జోడీగా జాన్వీకపూర్‌ నటించే అవకాశాలున్నట్టు సమాచారం. ప్రస్తుతం పూర్వ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. యాక్షన్‌ డ్రామాగా శక్తిమంతమైన కథ, కథనాలతో రూపొందుతున్న ఈ చిత్రానికి స్వరాలు: అనిరుధ్‌, ప్రొడక్షన్‌ డిజైన్‌: సాబు సిరిల్‌, ఛాయాగ్రహణం: రత్నవేలు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని