Oke Oka Jeevitham: ఓటీటీలోకి శర్వానంద్‌ ‘ఒకే ఒక జీవితం’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

శర్వానంద్‌ హీరోగా నూతన దర్శకుడు శ్రీకార్తిక్‌ తెరకెక్కించిన చిత్రం ‘ఒకే ఒక జీవితం’. ఈ సినిమా ఓటీటీ విడుదల తేదీ సోమవారం ఖరారైంది.

Published : 11 Oct 2022 01:18 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: శర్వానంద్‌ (Sharwanand) హీరోగా నూతన దర్శకుడు శ్రీకార్తిక్‌ తెరకెక్కించిన చిత్రం ‘ఒకే ఒక జీవితం’ (Oke Oka Jeevitham). టైమ్‌ ట్రావెల్‌ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా ఇటీవల థియేటర్లలో విడుదలై విశేష ప్రేక్షకాదరణ పొందింది. తాజాగా ఓటీటీ విడుదల తేదీ ఖరారైంది. ‘సోనీ లివ్‌’ (Sony Liv)లో ఈ నెల 20 నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్‌కానుంది. ‘జీవితం రెండో అవకాశం ఇస్తే విధి రాతను మార్చుకోగలమా?’ అంటూ ఓ వీడియోను పోస్ట్‌ చేసింది సదరు సంస్థ. రీతూ వర్మ కథానాయికగా నటించిన ఈ సినిమాలో అమల, వెన్నెల కిశోర్‌, ప్రియదర్శి కీలక పాత్రలు పోషించిన సంగతి తెలిసిందే.

క‌థేంటంటే: ఆది (శ‌ర్వానంద్‌), శ్రీను (వెన్నెల‌ కిషోర్‌), చైతూ (ప్రియ‌ద‌ర్శి) మంచి స్నేహితులు. చిన్నప్పట్నుంచీ క‌లిసి పెరిగిన వీళ్లు ఒకొక్కరూ ఒక్కో స‌మ‌స్యతో స‌త‌మ‌త‌మ‌వుతూ ఉంటారు. ఎవ‌రిలోనూ సంతృప్తి ఉండదు. ఈ ముగ్గురికీ పాల్ (నాజ‌ర్‌) అనే ఓ శాస్త్రవేత్త ప‌రిచ‌యం అవుతాడు. అతడు ఇర‌వ‌య్యేళ్లుగా టైమ్ మెషిన్‌ క‌నిపెట్టడం కోసం కష్టప‌డుతుంటాడు. చివ‌రికి తాను క‌నిపెట్టిన టైమ్ మెషిన్‌తో గ‌తంలోకి వెళ్లి త‌మ త‌ప్పుల్ని స‌రిదిద్దుకునే అవ‌కాశాన్ని ఆది, శ్రీను, చైతూల‌కి ఇస్తాడు. మ‌రి వాళ్లు గ‌తంలోకి వెళ్లి ఏం చేశారు? త‌ప్పుల్ని స‌రిదిద్దుకున్నారా ? భ‌విష్యత్తుని గొప్పగా మార్చుకున్నారా? విధి వారికి ఏం చెప్పింద‌నేది మిగ‌తా క‌థ‌.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని