Ooru Peru Bhairavakona: ‘ఊరు పేరు భైరవకోన’ రిలీజ్‌ వాయిదా.. కొత్త తేదీ ఎప్పుడంటే..?

‘ఊరు పేరు భైరవకోన’ (Ooru Peru Bhairavakona) రిలీజ్‌ వాయిదా పడింది. తెలుగు ఫిల్మ్‌ ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌ ప్రెస్‌మీట్‌లో దిల్‌రాజు ఈ విషయాన్ని తెలియజేశారు.

Published : 29 Jan 2024 21:14 IST

హైదరాబాద్‌: సందీప్‌ కిషన్‌ (Sundeep Kishan) నటించిన ‘ఊరు పేరు భైరవకోన’ (Ooru Peru Bhairavakona) రిలీజ్‌ వాయిదా పడింది. ‘ఈగల్‌’ (Eagle) సోలో రిలీజ్‌ను దృష్టిలో ఉంచుకుని సినిమా వాయిదాకు చిత్రబృందం అంగీకారం తెలిపిందని తెలుగు ఫిల్మ్‌ ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌ తెలిపింది. ‘‘రవితేజ నటించిన ‘ఈగల్‌’ సంక్రాంతికి విడుదల కావాల్సిన చిత్రం. అప్పుడున్న పోటీని దృష్టిలో ఉంచుకుని రిలీజ్‌ వాయిదా వేయమని మేము అడగ్గానే చిత్ర నిర్మాణసంస్థ పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ అంగీకరించింది. మేము ఇచ్చిన మాట ప్రకారం.. ఫిబ్రవరి 9న అది సోలో రిలీజ్‌ కానుంది. అదే రోజున విడుదల కానున్న ‘ఊరుపేరు భైరవకోన’ టీమ్‌తో మాట్లాడాం. వాయిదా వేయమని కోరాం. వాళ్లు వెంటనే ఓకే అన్నారు. ఈమేరకు ఫిబ్రవరి 16న అది విడుదల కానుంది’’

Hanuman: ‘హను-మాన్‌’ ఓటీటీ రిలీజ్‌.. స్ట్రీమింగ్‌ అప్పుడేనా..?

‘‘తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన 24 క్రాఫ్ట్స్‌ కీలక సభ్యులందరం ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసి పరిశ్రమలోని సమస్యలపై మాట్లాడాం. వాటి పరిష్కారానికి అన్నివిధాలా సాయం చేస్తామన్నారు. 31న జరగనున్న ఈసీ మీటింగ్‌లో చర్చలు జరిపి.. త్వరలోనే మరోసారి ముఖ్యమంత్రిని కలుస్తాం. సంక్రాంతికి బాక్సాఫీస్‌ వార్‌ ఉంటుందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే, పండక్కి తమ సినిమా రిలీజ్‌ చేయాలని అందరూ అనుకుంటారు. ‘ఈగల్‌’ వాళ్లు అర్థం చేసుకున్నట్లు కొంతమంది అర్థం చేసుకుని వెనక్కి వెళ్తారు. కొంతమంది వెళ్లరు. వచ్చే ఏడాది నుంచి దిల్‌రాజు మీకు దొరకడు. ఎందుకంటే, వచ్చే టర్మ్‌కు నేను ప్రెసిడెంట్‌గా ఉండను. వచ్చే సంక్రాంతికి నా ప్రొడక్షన్‌ హౌస్‌ నుంచి సినిమా తప్పక ఉంటుంది. 31న జరగనున్న ఈసీ మీటింగ్‌లో కీలక నిర్ణయాలు తీసుకుంటాం’’ అని దిల్‌రాజు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని