Oscars: ఆస్కార్‌ నామినేషన్ల బరిలో 10 భారతీయ చిత్రాలు

ప్రఖ్యాత ఆస్కార్‌ అవార్డుల ప్రకటన తుది అంకానికి చేరుకుంది. విజేతలెవరో ఇంకొద్దిరోజుల్లోనే తేలిపోనుంది. నిర్వాహకుల కమిటీ ది అకాడెమీ ఆఫ్‌ మోషన్‌ పిక్చర్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్సెన్‌ నామినేషన్‌ బరిలో నిలిచే చిత్రాల వివరాల్ని మంగళవారం ప్రకటించింది.

Updated : 11 Jan 2023 07:16 IST

ప్రఖ్యాత ఆస్కార్‌ (Oscars) అవార్డుల ప్రకటన తుది అంకానికి చేరుకుంది. విజేతలెవరో ఇంకొద్దిరోజుల్లోనే తేలిపోనుంది. నిర్వాహకుల కమిటీ ది అకాడెమీ ఆఫ్‌ మోషన్‌ పిక్చర్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్సెన్‌ నామినేషన్‌ బరిలో నిలిచే చిత్రాల వివరాల్ని మంగళవారం ప్రకటించింది. ఇందులో ఆఖరి మెట్టుపై 10 భారతీయ చిత్రాలు ఉండటం ఈ ఏడాది ప్రత్యేకత. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR), ‘గంగూభాయ్‌ కాఠియావాడి’, ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’, ‘కాంతార’లు షార్ట్‌లిస్ట్‌లో ఉన్నట్టు కమిటీ ప్రకటించింది. భారతీయ అధికారిక ఎంట్రీ చిత్రం ‘ఛెల్లో షో’తోపాటు ‘మీ వసంత్‌రావు’, ‘తుజ్య సాథీ కహీ హై’, ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్‌’, ‘విక్రాంత్‌ రోణ’ ‘ఇరవిన్‌ నిహల్‌’ సైతం బరిలో ఉన్నాయి. ఈ బరిలో మొత్తం 301 చిత్రాలు పోటీపడుతున్నాయి. ‘అవతార్‌: ది వే ఆఫ్‌ వాటర్‌’, ‘బ్లాక్‌ పాంథర్‌: వాకాండ ఫరెవర్‌’, ‘టాప్‌ గన్‌: మావెరిక్‌’లాంటి చిత్రాలు ప్రధాన విభాగంలో ఉన్నాయి. జనవరి 12న ఓటింగ్‌ చేయడం మొదలుపెడతారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని