ott movies this week telugu: ఈ వారం ఓటీటీలో 20కు పైగా చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు..!

ott movies this week telugu: ఈ వారం ఓటీటీలో పలు చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యాయి. ఏ వేదికపై ఏ మూవీ/వెబ్‌సిరీస్‌ స్ట్రీమింగ్‌ అవుతుందో చూసేయండి

Published : 02 Nov 2023 14:56 IST

యాక్షన్‌తో అలరించేందుకు షారుక్‌..

షారుక్‌ ఖాన్‌ (Shah Rukh Khan) కథానాయకుడిగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘జవాన్‌’ (Jawan). సెప్టెంబరు 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఘన విజయాన్ని అందుకోవడమే కాకుండా బాక్సాఫీస్‌ వద్ద రూ.1,100 కోట్లు వసూలు చేసింది. షారుక్‌ పుట్టినరోజును పురస్కరించుకుని ప్రస్తుతం (నవంబరు 2) నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) వేదికగా ఈ చిత్రం స్ట్రీమింగ్‌  అవుతోంది. హిందీ, తెలుగు, తమిళ, భాషల్లో ‘జవాన్‌’ అందుబాటులోకి వచ్చింది.


ఫీల్‌గుడ్‌ మూవీగా..

నవీన్‌ చంద్ర, స్వాతి ప్రధాన పాత్రల్లో శ్రీకాంత్‌ నాగోతి తెరకెక్కించిన చిత్రం ‘మంత్‌ ఆఫ్‌ మధు’ (Month of madhu ott). అక్టోబరు 6న విడుదలైన ఈ సినిమా ఫీల్‌గుడ్‌ మూవీగా ప్రేక్షకుల మెప్పు పొందింది. ఇప్పుడు ఓటీటీ వేదికగా అలరించేందుకు సిద్ధమైంది. తెలుగులో ఓటీటీ వేదిక ‘ఆహా’ (Aha) వేదికగా నవంబరు 3వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆహా పోస్టర్‌ను పంచుకుంది.


‘స్కంద’ వచ్చేసింది!

బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో రామ్ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘స్కంద’ (skanda ott release date). శ్రీలీల కథానాయిక. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందనలు అందుకుంది. తాజాగా ఓటీటీలో  స్ట్రీమింగ్‌ మొదలైంది. ప్రముఖ ఓటీటీ వేదిక డిస్నీ+హాట్‌స్టార్‌ వేదికగా అందుబాటులోకి వచ్చింది.


ఓటీటీలో స్ట్రీమింగ్‌ అయ్యే మరికొన్ని చిత్రాలు.. సిరీస్‌లు

  • డిస్నీ+హాట్‌స్టార్‌
  • ఆర్య: సీజన్‌ 3 (హిందీ) నవంబరు 3
  • బిహైండ్‌ ది అట్రాక్షన్‌ సీజన్‌2 (ఇంగ్లీష్‌) స్ట్రీమింగ్‌ అవుతోంది
  • ద త్రీ డిటెక్టివ్స్‌ (జర్మన్‌) స్ట్రీమింగ్ అవుతోంది
  • అమెజాన్‌ ప్రైమ్‌
  • పి.ఐ. మీనా (హిందీ) నవంబరు 3
  • ఇన్‌విన్సిబుల్‌ సీజన్‌2  (ఇంగ్లీష్‌) నవంబరు 3
  • ఆర్‌ యూ ఓకే బేబీ (తమిళ్‌) స్ట్రీమింగ్ అవుతోంది
  • సోనీలివ్‌
  • స్కామ్‌ 2003: పార్ట్‌-2 (హిందీ) నవంబరు 3
  • నెట్‌ఫ్లిక్స్‌
  • ఆల్‌ ది లైట్‌ వి కెనాట్‌-సిరీస్‌ స్ట్రీమింగ్‌ అవుతోంది
  • సిగరెట్‌ గర్ల్:సిరీస్‌ (ఇండోనేషియన్‌) స్ట్రీమింగ్‌ అవుతోంది
  • లాక్‌డ్‌ ఇన్‌ (హాలీవుడ్‌) స్ట్రీమింగ్‌ అవుతోంది
  • నైద్‌: మూవీ (ఇంగ్లీష్‌) స్ట్రీమింగ్‌ అవుతోంది
  • వింగ్‌ ఉమెన్‌: ది వే ఆఫ్‌ స్కార్పియన్‌: మూవీ (ఫ్రెంచ్‌) స్ట్రీమింగ్‌ అవుతోంది.
  • బ్లూ ఐ సమురాయ్‌: సిరీస్‌ (జపనీస్‌) నవంబరు 3
  • డైలీ డోస్‌ షన్‌షైన్‌ : సిరీస్‌ (కొరియన్‌) నవంబరు 3
  • ఫెర్రీ: ది సిరీస్‌ : వెబ్‌సిరీస్ (డచ్‌) నవంబరు 3
  • సెల్లింగ్‌ సన్‌సెట్‌ సీజన్‌ -7 (ఇంగ్లీష్‌) నవంబరు 3
  • స్లై :మూవీ (ఇంగ్లీష్‌) నవంబరు 3
  • ది టేలర్‌ సీజన్‌ 3-సిరీస్‌ (టర్కిష్‌) నవంబరు 3
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని