Pawankalyan: పవన్ పార్టీలో స్టెప్పులేసిన డైరెక్టర్.. సునీల్ కామెంట్ వైరల్
తెలుగు రాష్ట్రాల్లో ‘భీమ్లానాయక్’ మేనియా కొనసాగుతోంది. పవర్‌స్టార్ నుంచి అభిమానులు ఎలాంటి ఎలివేషన్స్ కోరుకుంటారో అవన్నీ ఈ సినిమాలో ఉండటంతో ప్రేక్షకులు ఈచిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు.....
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ‘భీమ్లానాయక్’ మేనియా కొనసాగుతోంది. పవర్‌స్టార్ నుంచి అభిమానులు ఎలాంటి ఎలివేషన్స్ కోరుకుంటారో అవన్నీ ఈ సినిమాలో ఉండటంతో ప్రేక్షకులు ఈచిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు. దీంతో ఈసినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తూ బ్లాక్‌బస్టర్ విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ సినిమా సక్సెస్‌ని పురస్కరించుకుని పవన్, త్రివిక్రమ్ శ్రీనివాస్ శనివారం రాత్రి బిగ్గెస్ట్ వీకెండ్ పార్టీ ఏర్పాటు చేసినట్లు వార్తలు బయటకు వచ్చాయి. ఈ పార్టీకి సంబంధించిన పలు ఫొటోలు ఇప్పటికే నెట్టింట్లో వైరల్‌గా మారగా.. తాజాగా మరికొన్ని ఆన్లైన్లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
పవన్ గ్రాండ్ ఎంట్రీ.. గురూజీ ఫుల్ ఖుష్..!
‘భీమ్లానాయక్’ గ్రాండ్ సక్సెస్ పార్టీకి సంబంధించిన అన్ని విషయాలను ప్రముఖ దర్శకుడు, పవన్‌కు అత్యంత సన్నిహితుడు, ‘భీమ్లానాయక్’ చిత్రానికి దర్శకత్వ పర్యవేక్షణ చేసిన త్రివిక్రమ్ శ్రీనివాస్ దగ్గరుండి చూసుకున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా పవన్ ఎంట్రీని కాస్త స్పెషల్‌గా ఏర్పాటు చేశారాయన. పార్టీ జరిగే ప్రాంతంలోకి పవన్ ఎంట్రీ ఇవ్వగానే.. దారికి ఇరువైపులా టపాసులు పెట్టారు. ఆ వెలుగుల నుంచి పవన్ నడుచుకుంటూ వెళ్లి.. త్రివిక్రమ్‌ని ప్రేమగా ఆలింగనం చేసుకున్నారు.
పార్టీలో స్టెప్పులేసిన దర్శకుడు..!
దర్శకుడు సాగర్ కె.చంద్ర మాటల్లో చెప్పలేనంత ఆనందాన్ని పొందుతున్నారు. తన సంతోషాన్ని అందరితో పంచుకునేందుకు పార్టీలో ‘లాలా భీమ్లా’ పాటకు కొరియోగ్రాఫర్ గణేశ్ మాస్టర్‌తో కలిసి డ్యాన్స్ చేశారు. ఆయన వేసిన స్టెప్పులు చూసి త్రివిక్రమ్ నవ్వులు పూయించారు. చప్పట్లు కొడుతూ ఎంకరేజ్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.
హిట్స్ ఇచ్చారు.. ఇవ్వనున్నారు..!
మూడేళ్ల విరామం అనంతరం ‘వకీల్‌సాబ్’తో మొదలైన తన హిట్ కౌంట్‌ని ఈ సినిమాతో కొనసాగించారు పవన్. ఇప్పుడు ఆయన ‘హరిహర వీరమల్లు’, ‘భవదీయుడు భగత్‌సింగ్’ చిత్రాల్లో నటిస్తున్నారు. దీంతో, తాజాగా జరిగిన వీకెండ్ పార్టీలో కేవలం ‘భీమ్లానాయక్’ టీమ్ మాత్రమే కాకుండా పవన్ తదుపరి చిత్రాల దర్శకులు కూడా తళుక్కున మెరిశారు. దీనికి సంబంధించిన ఫొటోలను క్రిష్ ఇన్‌స్టా వేదికగా షేర్ చేయగా.. ‘హిట్స్ ఇచ్చారు.. ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు’ అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
పవన్‌ని హగ్ చేసుకున్న హైపర్ ఆది..
సాధారణంగా హీరో అంటే కేవలం మెయిన్ టీమ్‌తోనే ఫొటోలు దిగేందుకు ఇష్టం చూపిస్తుంటారు. కానీ పవన్ మాత్రం టీమ్‌లో పనిచేసిన.. చాలా మందితో చిన్నాపెద్దా అనే తేడా లేకుండా ఫొటోలు దిగారు. ముఖ్యంగా హైపర్ ఆది.. పవన్‌ని హగ్ చేసుకుని దిగిన ఫొటోలు ఇప్పుడు అంతటా వైరల్ అయ్యాయి.
స్క్రీన్ మాత్రమే కాదు.. స్టూల్ కూడా..!
‘భీమ్లానాయక్’ చిత్రంలో నటుడు సునీల్ ఓ పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. కానిస్టేబుల్‌గా ఆయన చేసిన రోల్, ‘భీమ్లానాయక్’ టైటిల్ సాంగ్‌కి పవన్‌తో కలిసి ఆయన వేసిన స్టెప్పులు అందర్నీ ఆకట్టుకున్నాయి. కాగా, తాజాగా ఆయన షేర్ చేసిన ఓ ఫొటో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సాంగ్ షూట్ జరుగుతున్న సమయంలో పవన్‌కల్యాణ్‌తో కలిసి ఫొటో తీసుకున్న ఆయన.. ‘‘ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకున్నానని మాత్రమే మీకు తెలుసు.. కానీ స్టూల్ కూడా షేర్ చేసుకున్నాననే విషయం మీకు తెలియదు. పవన్‌ని ఎప్పటికీ ఆదరిస్తూనే ఉంటా’’ అని సునీల్ రాసుకొచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సమంత ఫొటోపై చర్చ.. ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న అభిమానులు
సమంత (Samantha) ఒక ఫొటో షేర్ చేసి డిలీట్ చేశారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. -
ఆ సిబిల్ స్కోర్ చూస్తే జాతకం బయటపడుతుంది: ‘కర్మ’పై పూరి జగన్నాథ్
ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ ‘కర్మ’ గురించి తన యూట్యూబ్ ఛానల్ వేదికగా పలు ఆసక్తికర అంశాలు పంచుకున్నారు. -
కోక కట్టిన మీనాక్షి.. హీటెక్కించిన దిశాపటానీ..
ఇన్‌స్టా వేదికగా మన సినీతారలు లేటెస్ట్ అప్డేట్స్తో వచ్చేశారు. ఆదివారం ఏయే పిక్స్‌తో అలరించారో మీరూ చూసేయండి -
రోజా కామెంట్స్‌పై స్పందించిన గెటప్ శ్రీను.. ఏమన్నారంటే?
తనపై మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలపై గెటప్ శ్రీను స్పందించారు. -
ఎన్టీఆర్‌కు అర్జున్‌పై నమ్మకం.. నేను రీషూట్ చేయలేదు: సుకుమార్
తన శిష్యుడు, దర్శకుడు అర్జున్‌పై సుకుమార్ ప్రశంసలు కురిపించారు. -
మృణాల్ అవుట్‌ఫిట్‌కు నెటిజన్లు ఫిదా.. డిజైనింగ్‌కు 1400 గంటలు
హీరోయిన్ మృణాల్ ఠాకూర్ అవుట్‌ఫిట్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. -
నమిత.. మమితగా మారిందిలా.. ‘ప్రేమలు’ హీరోయిన్ పేరు వెనుక కథేంటంటే?
‘ప్రేమలు’ హీరోయిన్ మమితా బైజు పేరు వెనుక ఉన్న స్టోరీ మీకు తెలుసా? -
శ్రీలీల సమ్మర్ షో.. అరియానా హాట్ ‘గ్లో’
సామాజిక మాధ్యమాల వేదికగా సినీతారలు పంచుకున్న ఆసక్తికర అప్డేట్స్ మీకోసం.. -
‘డైరెక్టర్స్ డే’ ఈవెంట్ తేదీ మార్పు.. కొత్త డేట్ ఎప్పుడంటే!
దాసరి నారాయణరావు జయంతి వేడుకలను తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ ఘనంగా నిర్వహించింది. ఈసందర్భంగా ‘డైరెక్టర్స్ డే’ ఈవెంట్ కొత్త తేదీని ప్రకటించింది. -
అందుకే సినిమాల నుంచి కొంత విరామం తీసుకున్నా: షారుక్ ఖాన్
మూడు సినిమాల తర్వాత కొంత సమయం విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు షారుక్ చెప్పారు. -
అషు ‘సూపర్ డీలక్స్ బాడీ’.. సాగరకన్యలా నోరా ఫతేహి!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
పక్క వారిపై ఆ భావన ఉంటే ఈగోలు అడ్డురావు: శోభితా ధూళిపాళ్ల
ప్రేమ తన జీవితంలో కీలకపాత్ర పోషిస్తుందని నటి శోభితా ధూళిపాళ్ల అన్నారు. -
సింపుల్‌గా నటుడి కుమార్తె వివాహం
మలయాళ నటుడు జయరాం కుమార్తె వివాహం గుడిలో సింపుల్‌గా జరిగింది. -
యశ్ ‘టాక్సిక్’పై వైరలవుతోన్న న్యూస్.. ఎన్ని భాగాలంటే!
యశ్ నటిస్తోన్న ‘టాక్సిక్’ చిత్రానికి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
నిర్మాతలే కావాలని రూమర్స్ సృష్టించేవారు.. : సోనాలి బింద్రే
ఇప్పటితో పోలిస్తే తాను ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో పరిస్థితులు భిన్నంగా ఉండేవని నటి సోనాలి బింద్రే అన్నారు. -
ఫొటోషూట్‌లో హొయలు.. వావ్ అనిపించేలా జాన్వీ.. కట్టిపడేసిన హెబ్బా
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఆ క్యారెక్టర్ ప్లే చేయాలంటే భయమేసింది: రాశీఖన్నా
తాను సవాలుగా స్వీకరించి నటించిన పాత్రల గురించి రాశీఖన్నా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అవేంటంటే? -
అభిమాని బర్త్‌డే సెలబ్రేట్ చేసి.. ఖరీదైన గిఫ్ట్ ఇచ్చి.. వీడియో వైరల్
తన అభిమానికి జీవితంలో మరిచిపోలేని జ్ఞాపకాన్ని ఇచ్చారు బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం. -
‘పుష్ప2’ స్టెప్‌పై డేవిడ్ వార్నర్ కామెంట్.. చాలా ఈజీ అంటూ రిప్లై ఇచ్చిన బన్నీ
‘పుష్ప2’ పాటపై ఆసీస్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ కామెంట్ చేశారు. ఆ కామెంట్‌కు అల్లు అర్జున్ రిప్లై ఇచ్చారు. -
సిద్ధార్థ్‌తో నిశ్చితార్థం.. అందుకే వెల్లడించాల్సి వచ్చింది: అదితిరావు
తన తల్లి కోరిక మేరకు నిశ్చితార్థం విషయాన్ని మీడియాకు వెల్లడించినట్లు అదితిరావు హైదరీ చెప్పారు. -
ఎన్టీఆర్ నాకు తమ్ముడితో సమానం: రాజమౌళి
ఎన్టీఆర్‌తో తనకున్న బంధంపై రాజమౌళి కామెంట్ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆస్ట్రేలియాలో కత్తి దాడిలో భారత విద్యార్థి మృతి
-
అణ్వాయుధాల కసరత్తు మొదలుపెట్టండి - సైన్యానికి పుతిన్ ఆదేశం
-
రోజంతా ఒడుదొడుకుల్లో.. చివరికి ఫ్లాట్‌గా ముగిసిన సూచీలు
-
‘నిన్ను చూసి గర్వపడుతున్నాం’ పూంచ్‌లో అమరుడైన సైనికుడి సోదరి ఆవేదన
-
రూ.15వేల జీతగాడి ఇంట్లో రూ.25 కోట్లు.. ఎవరీ మంత్రి అలంఘీర్ ..?
-
రహదారిపై గుంతలకు NHAI కొత్త టెక్నిక్.. వాటంతట అవే పూడుకునేలా.!