అమితాబ్‌పై దిల్లీ కోర్టులో పిటిషన్‌

కరోనాపై అవగాహన కార్యక్రమంలో భాగంగా కాలర్‌ట్యూన్‌కు బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ మాటలు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే.. ఇందుకు ఆయన అనర్హుడు అంటూ దిల్లీకి చెందిన ఓ సమాజిక కార్యకర్త దిల్లీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అమితాబ్‌ గొంతును ఆ కాలర్‌ట్యూన్‌

Published : 07 Jan 2021 23:02 IST

ముంబయి: కరోనాపై అవగాహన కార్యక్రమంలో భాగంగా కాలర్‌ట్యూన్‌కు బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ గాత్రం ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే.. ఇందుకు ఆయన అనర్హుడు అంటూ దిల్లీకి చెందిన ఓ సామాజిక కార్యకర్త దిల్లీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అమితాబ్‌ గొంతును ఆ కాలర్‌ట్యూన్‌ నుంచి తొలగించాలని ఆయన కోరారు. అమితాబ్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులకు కరోనా సోకిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు.

‘కరోనాకాలంలో ఎంతో మంది సినిమా ప్రముఖులు సమాజసేవలో పాల్గొన్నారు. పేదలకు భోజనం పెట్టారు. వసతి కల్పించారు. నిత్యావసరాలు ఇవ్వడంతో పాటు ఆర్థికంగానూ ఆదుకున్నారు. ఇలా వాళ్లకు తోచిన సాయం చేశారు. దేశసేవ చేసిన వాళ్లలో చాలామంది ఈ కాలర్‌ట్యూన్‌కు ఉచితంగా తమ మాటలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. అమితాబ్‌ మాత్రం.. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కూడా పారితోషికం తీసుకున్నారు. ఇప్పుడేమో ఆయన కుటుంబం కూడా కరోనా నుంచి బయటపడలేకపోయింది’ అని ఆ పిటిషనర్‌ పేర్కొన్నారు.

‘అమితాబ్‌ ఒక సామాజిక కార్యకర్తగా దేశ సేవ చేయలేదు. ఆయనపై చాలా కేసులు కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయి. అమితాబ్‌ ఈ అవగాహన కార్యక్రమానికి అనర్హుడు’ అని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీఎన్‌.పటేల్‌, జస్టిస్‌ జ్యోతిసింగ్‌ ధర్మాసనం గురువారం విచారించింది. కాగా కోర్టు తదుపరి విచారణను జనవరి 18కు వాయిదా వేసింది.

ఇవీ చదవండి!

సమంత తొలి వెబ్‌సిరీస్‌ వచ్చేస్తోంది

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని