Prabhas: పెళ్లిపై ప్రభాస్‌ కామెంట్స్‌ వైరల్‌

పాన్‌ ఇండియా హీరో ప్రభాస్‌ తన పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీలో మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌గా పేరు తెచ్చుకున్న ఆయన తాజాగా తన పెళ్లిపై స్పందించారు...

Published : 03 Mar 2022 10:24 IST

అందుకే సింగిల్‌గా ఉన్నా అంటోన్న హీరో

ముంబయి: పాన్‌ ఇండియా హీరో ప్రభాస్‌ తన పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీలో మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌గా పేరు తెచ్చుకున్న ఆయన తాజాగా పెళ్లిపై స్పందించారు. ఆయన నటిస్తోన్న ప్రేమకథా చిత్రం ‘రాధేశ్యామ్‌’ ట్రైలర్‌ విడుదల కార్యక్రమం బుధవారం ముంబయిలో వేడుకగా జరిగింది. ప్రేమ, విధికి మధ్య జరిగే పోరుని తెలియజేస్తూ తెరకెక్కిన ఈ ఫీల్‌గుడ్‌ ప్రేమకథా చిత్రంలో ప్రభాస్‌ హస్తసాముద్రిక నిపుణుడు విక్రమాదిత్యగా కనిపించనున్నారు. ఆయన ప్రేయసిగా ప్రేరణ అనే పాత్రలో పూజాహెగ్డే సందడి చేయనున్నారు.

ట్రైలర్‌ విడుదల అనంతరం విలేకర్లు అడిగిన పలు ప్రశ్నలపై ప్రభాస్‌ స్పందించారు. తరచూ యాక్షన్‌ కథల్లో నటిస్తే అభిమానులు బోర్‌ ఫీల్‌ అవుతారని.. అందుకే కాస్త విభిన్నంగా చాలా సంవత్సరాల తర్వాత ప్రేమకథతో అలరించేందుకు వస్తున్నానని అన్నారు. ఇదిలా ఉండగా ఓ విలేకరి.. ‘‘ప్రేమ విషయంలో విక్రమాదిత్య అంచనాలు తప్పాయి’ అని ట్రైలర్‌ ఓ డైలాగ్‌ ఉంది. మరి నిజ జీవితంలో మీకు ఎప్పుడైనా  అలా జరిగిందా?’’ అని ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు నవ్వులు పూయించిన ప్రభాస్‌.. ‘‘చాలాసార్లు ప్రేమ విషయంలో నా అంచనాలు తప్పాయి. అందుకే, నేను ఇంకా పెళ్లి చేసుకోలేదు’’ అని సరదాగా సమాధానం ఇచ్చారు. పెళ్లిపై ప్రభాస్‌ చేసిన ఈ ఆసక్తికర వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని