PrakashRaj: చిత్రపరిశ్రమను ఇబ్బందులకు గురి చేస్తూ.. ప్రోత్సహిస్తున్నామంటే ఎలా నమ్మాలి?

సినిమా పరిశ్రమ పట్ల ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వ్యవహరిస్తోన్న తీరును నటుడు ప్రకాశ్‌రాజ్‌ తప్పుపట్టారు. పవన్‌కల్యాణ్‌ను దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే ‘భీమ్లానాయక్‌’ రిలీజ్‌ని దృష్టిలో ఉంచుకొని ఏపీ ప్రభుత్వం టికెట్‌ ధరల పెంపుకు సంబంధించి....

Updated : 27 Feb 2022 15:53 IST

ఏపీ ప్రభుత్వ తీరుపై ప్రకాశ్‌రాజ్‌ ఆగ్రహం

హైదరాబాద్‌: సినిమా పరిశ్రమ పట్ల ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వ్యవహరిస్తోన్న తీరును నటుడు ప్రకాశ్‌రాజ్‌ తప్పుపట్టారు. పవన్‌కల్యాణ్‌ను దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే ‘భీమ్లానాయక్‌’ రిలీజ్‌ని దృష్టిలో ఉంచుకొని ఏపీ ప్రభుత్వం టికెట్‌ ధరల పెంపునకు సంబంధించిన జీవోని విడుదల చేయలేదంటూ ఇటీవల పలువురు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నటుడు ప్రకాశ్‌రాజ్‌ ఏపీ ప్రభుత్వ తీరుని ఎండగట్టారు. ఈ మేరకు ఆయన ఆదివారం ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓ ట్వీట్‌ చేశారు.

‘చిత్రపరిశ్రమను ఇబ్బందులకు గురి చేస్తూ.. ప్రోత్సహిస్తున్నామంటే ఎలా నమ్మాలి?’ అని ప్రశ్నించారు. దయచేసి ఇంతటితో ఓ ముగింపు పలకండి అని కోరారు. ‘‘సృజన.. సాంకేతికత మేళవించిన సినిమా రంగంపై అధికార దుర్వినియోగం, ఆధిపత్య ధోరణి ఏమిటి? చిత్ర పరిశ్రమను క్షోభపెడుతూ మేమే ప్రోత్సహిస్తున్నామంటే నమ్మాలా? ఏమైనా ఉంటే రాజకీయ క్షేత్రంలో చూసుకోవాలి. కక్ష సాధింపులు బాక్సాఫీస్‌ వద్ద ఎందుకు?ఎంతగా ఇబ్బంది పెట్టినా ప్రేక్షకుల ఆదరాభిమానాలకు ఎవరూ అడ్డుకట్ట వేయలేరు’’ అని ప్రకాశ్‌ రాజ్‌ పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని