Nithiin: మీరిలా చేస్తే ఎలా?.. నితిన్‌ హామీపై నిర్మాత నాగవంశీ ట్వీట్‌

‘మీరిలా లాక్‌ చేస్తా ఎలా?’ అంటూ నితిన్‌ని ఉద్దేశించి నిర్మాత నాగవంశీ పెట్టిన ట్వీట్‌ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. 

Published : 03 Dec 2023 15:42 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘మా సినిమా చూసి ప్రేక్షకులు నవ్వకపోతే వారు తీసుకున్న టికెట్ డబ్బులు తిరిగి ఇచ్చేస్తాం’.. పలు దర్శక, నిర్మాతలు తమ చిత్రాలపై ధీమా వ్యక్తం చేస్తూ చెప్పే మాట ఇది. తాజాగా నితిన్‌ (Nithiin) సైతం తన కొత్త సినిమా ‘ఎక్స్‌ట్రా: ఆర్డినరీమ్యాన్‌’ (Extra: OrdinaryMan)పై నమ్మకంతో.. సరదాగా అలాంటి హామీనే ఇచ్చారు. ఆ చిత్రంలోని ‘ఒలే ఒలే పాపాయి.. పలాసకే వచ్చేయి’ (Ole Ole Paapaayi) అనే పాట ప్రోమోను చిత్ర బృందం శనివారం విడుదల చేసింది. ఈ కార్యక్రమంలో నితిన్‌ మాట్లాడుతూ.. ‘ఎక్స్‌ట్రా: ఆర్డినరీమ్యాన్‌ సినిమా చూస్తున్నప్పుడు మీరంతా కడుపుబ్బా నవ్వకపోతే.. మీ డబ్బులు నాగవంశీ వెనక్కి ఇస్తారు. మా మధ్య చాలా లావాదేవీలు ఉన్నాయి’’ అంటూ నవ్వులు పూయించారు. కొన్ని రోజుల క్రితం ‘మ్యాడ్‌’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా.. ‘‘జాతిరత్నాలు’ సినిమాకంటే ఒక్కసారైనా తక్కువ నవ్వితే ప్రేక్షకులు కొన్న టికెట్‌ డబ్బులు తిరిగి ఇచ్చేస్తా’’ అని నాగవంశీ (Naga Vamsi) ప్రకటించారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని నితిన్‌ ఫన్నీగా మాట్లాడారు. ఈ చిత్రానికి నిర్మాత నాగవంశీ కాకపోవడం గమనార్హం.  సంబంధిత వీడియోపై ‘ఎక్స్‌’ (ట్విటర్‌) వేదికగా నాగవంశీ స్పందించారు. ‘‘ఆరోజు ‘మ్యాడ్‌’ వైబ్‌లో అలా అనేశాం. నితిన్‌.. మీరు ఇలా లాక్‌ చేస్తే ఎలా?’’ అంటూ ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం జిఫ్‌ ఫొటోను పంచుకున్నారు.

అది నా జీవితంలో ఎక్స్‌ట్రార్డినరీ మూమెంట్‌: నితిన్‌

‘ఎక్స్‌ట్రా’లో నితిన్‌ జూనియర్‌ ఆర్టిస్ట్‌గా కనిపించనున్నారు. శ్రీలీల (Sree Leela) కథానాయిక. ప్రముఖ నటుడు రాజశేఖర్‌ (Rajasekhar) కీలక పాత్ర పోషించారు. ఎన్‌.సుధాకర్‌ రెడ్డి, నిఖితా రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబరు 8న (Extra OrdinaryMan Release Date) ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘ఒలే ఒలే పాపాయి’ పూర్తిపాట డిసెంబరు 4న విడుదల కానుంది. ‘మ్యాడ్‌’ విషయానికొస్తే.. నార్నె నితిన్‌ (ప్రముఖ హీరో ఎన్టీఆర్‌ బావమరిది), సంగీత్‌ శోభన్‌, రామ్‌ నితిన్‌ తదితరులు ప్రధాన పాత్రల్లో కల్యాణ్‌ శంకర్‌ తెరకెక్కించిన చిత్రమిది. అక్టోబరు 6న విడుదలై యూత్‌ను బాగా ఆకట్టుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని