ఆ దేశాల్లో ఉన్న సంతోషం మరెక్కడా లేదట
యూరప్‌లోని 10 దేశాల్లో ఉన్న ఆనందం మరెక్కడా లేదని ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ అన్నారు. సంతోషం ఎలా ఉంటుందో చూడాలంటే ఆ దేశాలకు వెళ్లి రావాలని ఆయన సూచించారు. తాజాగా ఆయన....
ఆనందాన్ని చూడాలంటే అక్కడికి వెళ్లాల్సిందే
హైదరాబాద్: యూరప్‌లోని 10 దేశాల్లో ఉన్న ఆనందం మరెక్కడా లేదని ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ అన్నారు. సంతోషం ఎలా ఉంటుందో చూడాలంటే ఆ దేశాలకు వెళ్లి రావాలని ఆయన సూచించారు. తాజాగా ఆయన ‘టాప్ 10 హ్యాపీయెస్ట్ కంట్రీస్’ గురించి ‘పూరీ మ్యూజింగ్స్’ వేదికగా వివరించారు. ఇంతకీ ఆ దేశాలేమిటి, అక్కడ ప్రజలు సంతోషంగా ఉండడానికి కారణమేమిటి?.. ఇలాంటి అంశాల గురించి పూరీ ఏమన్నారంటే..
‘ఒక మనిషి సంతోషంగా ఉన్నాడా లేదా? అనేది సరిగ్గా చెప్పలేం. ఎందుకంటే సంతోషాన్ని కొలవడం చాలా కష్టం. ఒక దేశంలో ఉన్న ప్రజలందరూ ఆనందంగా ఉన్నారా? లేదా? అని చెప్పడం ఇంకెంతో కష్టం. అయితే, దేశ జనాభా ఆనందాన్ని కొలవడం కోసం ఓ రీసెర్చ్ ఉంది. ఆరు అంశాల గురించి సమాచారాన్ని సేకరిస్తారు. ఆ దేశ జీడీపీ, ప్రజల జీవితకాలం, సామాజిక మద్దతు, అవినీతి, స్వేచ్ఛ, ఔదార్యం.. ఈ డేటాలను దృష్టిలో పెట్టుకుని యూఎన్‌వో వాళ్లు సంతోషకరమైన దేశాల జాబితాని తయారు చేస్తారు’
‘కొవిడ్ తర్వాత ఈ సంవత్సరం టాప్ 10 సంతోషకరమైన దేశాలేమిటంటే.. 10.ఆస్ట్రియా: ఇక్కడ ప్రజల జీవితకాల పరిమితి, జీడీపీ బాగుంది. ఈ దేశంలో అందరూ బైకింగ్ చేస్తారు. బైక్‌పై ఎక్కడికి వెళ్దామా? అనే టెన్షన్ తప్ప వీళ్లకి మరే ఇతర కష్టాలు లేవట. 9.న్యూజిలాండ్: ఎంతో శాంతివంతమైన దేశం. బీచ్‌లు, పర్వతాలు, కివీ పక్షులు, మనుషులకంటే ఎక్కువగా గొర్రెలు.. దాంతో ఇక్కడ అందరూ ఎంతో ఆనందంగా ఉన్నారు. 8.లక్సంబర్గ్: ఈ దేశంలో జనాభా చాలా తక్కువ. ఇక్కడ అందరికీ ఎక్కువ మొత్తంలో జీతాలు ఉంటాయి. సోషల్ సెక్యూరిటీ సిస్టమ్ కూడా ఎంతో బాగుంటుంది. ఉద్యోగ విరమణ అనంతరం సైతం ఇక్కడ దర్జాగా బతకవచ్చు. హెల్త్ కేర్ కూడా సూపర్‌గా ఉంటుంది. 7.స్వీడన్: జీడీపీ అత్యధికంగా ఉంది. సాంఘిక సమానత్వం ఉంది. ఉచిత విద్య అందిస్తారు. మహిళలకు ఎక్కువ గౌరవం ఇస్తారు. కావాలంటే 16 నెలలపాటు పెయిడ్ ఫ్యామిలీ లీవ్ కూడా తీసుకోని దేశాలన్ని తిరిగి రావచ్చు. 6. నార్వే..అద్భుతమైన ప్రజా సంక్షేమ వ్యవస్థ, సామాజిక మద్దతు, ప్రభుత్వంపై నమ్మకం.. ఈ అంశాలన్ని కలిసి అక్కడి ప్రజల్ని సంతోషంగా ఉండేలా చేశాయి. 5.నెదర్లాండ్స్.. ఈ దేశంలో సంరక్షణ ఉంది. హెల్త్‌కేర్ బాగుంది. విద్యావ్యవస్థ పటిష్టంగా ఉంది. ఆరోజు, ఈరోజు అని కాదు డచ్ ప్రజలు ఎప్పుడూ సంతోషంగానే ఉంటారని చెబుతారు. 4.ఐస్‌లాండ్: ఈ దేశంలోని ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారు. వాళ్లకి టెన్షన్ కలిగించే ఒకే ఒక్క విషయం.. డిన్నర్ కోసం రెస్టారెంట్‌లో సీట్ రిజర్వ్ చేయడం. అదొక్కటే ఇక్కడ కష్టమైపోతుందట. వెంటనే రిజర్వేషన్ దొరకడం లేదట. ఇంతకు మించి పెద్ద కష్టాలంటూ ఇక్కడ లేవు. 3.స్విట్జర్లాండ్: ఇక్కడ ప్రత్యక్ష ప్రజాస్వామ్యం ఉంది. దేశంలోని ప్రతి పౌరుడి మాటకు విలువ ఇస్తారు. ప్రతిఒక్కరి ప్రైవసీని గౌరవిస్తారు. ఇప్పుడు ఒక వ్యక్తి ఇంటి ముందు ట్రాఫిక్ సిగ్నల్ పెట్టాలంటే ప్రభుత్వం ముందు అతని నుంచి పర్మిషన్ తీసుకోవాలి. చక్కని వాతావరణం, ఆవులతో స్విట్జర్లాండ్ పచ్చగా ఉంది. 2.డెన్మార్క్: ఇది బైక్ ఫ్రెండ్లీ దేశం. ఇక్కడ పర్వతాలు ఉండవు. ఏదో ఒకటి అన్వేషిస్తూ చక్కగా బైక్‌పై తిరగవచ్చు. ఈ దేశంలో 70 శాతం మంది ప్రజలు సైకిళ్లపైనే తిరుగుతారు. 1.ఫిన్‌లాండ్.. నాలుగు సంవత్సరాల నుంచి ఈ దేశమే సంతోషకరమైన దేశాల జాబితాలో మొదటి స్థానంలో ఉంది. వీళ్లు మాట్లాడే భాషని ఫినీస్ అంటారు. ప్రపంచంలోనే మంచి విద్యావ్యవస్థ కలిగిన దేశంగా ఫిన్‌లాండ్‌కు పేరు ఉంది. ఇక్కడ టీచర్ కావాలంటే మాస్టర్ డిగ్రీ చేయాలి. టీచర్ అయితే మాత్రం జీతం మామూలుగా ఉండదు. ఏదైతేనే ప్రపంచంలో ఉన్న ఆనందకరమైన దేశాలివే. ఒకవేళ మీరు కనుక పరిశీలిస్తే.. ఈ దేశాలన్నింటిలోనూ జనాభా చాలా తక్కువగా ఉంది. అందుకే అక్కడ సంతోషం ఉంది. అలాగే ఈ దేశాలన్ని యూరప్‌లోనే ఉన్నాయి. కాబట్టి సంతోషం ఎలా ఉంటుందో చూడాలంటే మీరు యూరప్ వెళ్లాల్సిందే’’ అని పూరీ వివరించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Rajasthan: వారంతా నిర్దోషులే.. రాజస్థాన్ హైకోర్టు సంచలన తీర్పు!
-
Movies News
Allari Naresh: నాకు అలాంటి కామెడీ ఇష్టం.. అల్లరి నరేశ్‌కి అనిల్ రావిపూడి తోడైతే!
-
Sports News
David Warner: ‘డేవిడ్ వార్నర్‌ను వదిలేసి సన్‌రైజర్స్ పెద్ద తప్పు చేసింది’
-
Crime News
IPS Officer: విచారణలో మర్మాంగాలపై దాడి.. ఐపీఎస్ అధికారిపై వేటు!
-
India News
Karnataka: కోలార్ నుంచీ పోటీ చేస్తా: సిద్ధరామయ్య ప్రకటన
-
Movies News
Ott Censor: ఓటీటీ సెన్సార్‌కు యూకే ప్రభుత్వం ముసాయిదా.. అతిక్రమిస్తే రూ.2కోట్ల జరిమానా!