Raghava Lawrence: ‘రుద్రుడు’గా లారెన్స్‌

కతిరేశన్‌ దర్శకత్వంలో రాఘవ లారెన్స్‌ కథానాయకుడిగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. ప్రియభవానీ శంకర్‌ కథానాయిక. ఫైవ్‌స్టార్‌ క్రియేషన్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానకి ‘రుద్రుడు’ అనే పేరుని ఖరారు చేశారు.

Updated : 24 Jun 2022 08:58 IST

కతిరేశన్‌ దర్శకత్వంలో రాఘవ లారెన్స్‌ (Raghava Lawrence) కథానాయకుడిగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. ప్రియభవానీ శంకర్‌ (Priya Bhavani Shankar) కథానాయిక. ఫైవ్‌స్టార్‌ క్రియేషన్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానకి ‘రుద్రుడు’ (Rudrudu) అనే పేరుని ఖరారు చేశారు. గురువారం ఫస్ట్‌లుక్‌ని ఆవిష్కరించడంతోపాటు క్రిస్మస్‌కి చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు ప్రకటించాయి చిత్రబృందాలు. ‘‘యాక్షన్‌ థ్రిల్లర్‌ కథతో ఈ చిత్రం రూపొందుతోంది. ఇప్పటికే 90 శాతం చిత్రీకరణ పూర్తయింది. రుద్రుడుగా లారెన్స్‌ అలరిస్తాడు. తెలుగు, తమిళ భాషల్లో చిత్రం విడుదల కానుంద’’ని సినీ వర్గాలు తెలిపాయి. శరత్‌కుమార్‌, పూర్ణిమ భాగ్యరాజ్‌, నాజర్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జి.వి.ప్రకాశ్‌కుమార్‌, ఛాయాగ్రహణం: ఆర్‌.డి.రాజశేఖర్‌, కూర్పు: ఆంథోని.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని