సంద‌డి చేస్తోన్న ‘వ‌చ్చిందిరా’ జానపదం 

 ‘ప‌లాస’ చిత్రంలోని  ‘నాదీ నక్కిలీసు గొలుసు’,  ‘బావొచ్చాడు’ వంటి జానప‌ద గీతాల‌తో శ్రోత‌ల్ని విశేషంగా అల‌రించారు ర‌ఘు కుంచె. ఆయ‌న సంగీత సారథ్యంలో  ‘వచ్చిందిరా వ‌చ్చిందిరో’ అంటూ సాగే మ‌రో ఫోక్ సాంగ్ రూపుదిద్దుకుని, తాజాగా విడుదలైంది.

Published : 11 Jun 2021 20:24 IST

ఇంట‌ర్నెట్ డెస్క్‌: ‘ప‌లాస’ చిత్రంలోని ‘నాదీ నక్కిలీసు గొలుసు’, ‘బావొచ్చాడు’ వంటి జానప‌ద గీతాల‌తో శ్రోత‌ల్ని విశేషంగా అల‌రించారు ర‌ఘు కుంచె. ఆయ‌న సంగీత సారథ్యంలో ‘వచ్చిందిరా వ‌చ్చిందిరో’ అంటూ సాగే మ‌రో ఫోక్ సాంగ్ రూపుదిద్దుకుని, తాజాగా విడుదలైంది. స్వీయ ర‌చ‌న‌లో ఈ గీతాన్ని అసిరయ్య ఆల‌పించారు. గిరిధ‌ర్ రాగోలు ర్యాప్ అందించ‌గా ర‌ఘు కుంచె ఆల‌పించారు.  ‘బ్యాచ్’ సినిమా కోసం ఈ ప్ర‌య‌త్నం చేశారు ర‌ఘు కుంచె. రేసుగుర్రం, దువ్వాడ జ‌గ‌న్నాథం, మ‌ళ్లీరావా త‌దిత‌ర చిత్రాల్లో బాల నటుడిగా మెరిసిన సాత్విక్ హీరోగా తెర‌కెక్కుతోన్న చిత్ర‌మిది. నేహా ప‌ఠాన్ నాయిక‌. శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. కాలేజీ నేప‌థ్యంలో సాగే క‌థ ఇది. ఆల‌స్య‌మెందుకు మీరూ వినేయండి..


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని