Nithiin: నితిన్‌ సినిమాలో రాజశేఖర్‌

తెలుగులో యాంగ్రీ యంగ్‌మేన్‌ అనగానే గుర్తొచ్చే కథానాయకుడు రాజశేఖర్‌. ఆవేశంతో కూడిన పాత్రల్లో కనిపిస్తూ... కథానాయకుడిగా దశాబ్దాలపాటు ప్రేక్షకుల్ని అలరించారు.

Updated : 12 Oct 2023 14:02 IST

తెలుగులో యాంగ్రీ యంగ్‌మేన్‌ అనగానే గుర్తొచ్చే కథానాయకుడు రాజశేఖర్‌. ఆవేశంతో కూడిన పాత్రల్లో కనిపిస్తూ... కథానాయకుడిగా దశాబ్దాలపాటు ప్రేక్షకుల్ని అలరించారు. గుర్తుండిపోయే సినిమాలెన్నో చేశారు. అయితే కొన్నేళ్లుగా ఆయన కొత్త అవతారంపై తరచూ ప్రచారం సాగుతూ వచ్చింది. ప్రతినాయకుడి పాత్రలో అని కొన్నిసార్లు.. ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారని కొన్ని సినిమాల విషయంలో గట్టిగానే వినిపించింది. ఆ తరహా పాత్రలతో ఆయనకి చాలా అవకాశాలే వచ్చినా చేయలేదు. అయితే ఇప్పుడు ఆ సమయం వచ్చింది. నితిన్‌ కథానాయకుడిగా రూపొందుతున్న ‘ఎక్స్‌ట్రా’లో రాజశేఖర్‌ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. రెండు రోజుల కిందటే ఆయన ‘ఎక్స్‌ట్రా’ సెట్‌లోకి అడుగుపెట్టారు. తనదైన శైలిలోనే సాగే  ఓ ప్రత్యేక  పాత్రలో రాజశేఖర్‌ నటిస్తున్నారు. వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. సుధాకర్‌ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబరు 8న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని