Rajinikanth: మలేషియా ప్రధానిని కలిసిన రజనీకాంత్.. ఏం మాట్లాడారంటే?

మలేషియా ప్రధాని అన్వర్‌ ఇబ్రహీం (Anwar Ibrahim)ను రజనీకాంత్‌ కలిశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Published : 11 Sep 2023 17:26 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అగ్ర కథానాయకుడు రజనీకాంత్‌ మలేషియా ప్రధాని అన్వర్‌ ఇబ్రహీం (Anwar Ibrahim)ను మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మలేషియా వెళ్లిన రజనీకాంత్ (Rajinikanth) అక్కడ ప్రధానిని కలిసి కాసేపు ముచ్చటించారు. దీంతో ఈ విషయం ఇప్పుడు రాజకీయంగానూ చర్చనీయాంశంగా మారింది.

తన ఎక్స్‌లో (ట్విటర్‌) ఈ ఫొటోలను షేర్‌ చేసిన అన్వర్‌ ఇబ్రహీం.. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న రజనీకాంత్‌ను కలవడం తనకెంతో ఆనందంగా ఉందన్నారు. ‘ప్రజల కష్టాలు, ఆ కష్టాల సమయంలో నేను అందించిన సేవల పట్ల ఆయన గౌరవం ప్రదర్శించారు. అలాగే భవిష్యత్తులో ఆయన తీయనున్న సినిమాల్లో సామాజిక అంశాలు ఎక్కువగా ఉండేలా చూడాలని నేను కోరాను’ అని తన ట్వీట్‌లో పేర్కొన్నారు. అలాగే రజనీకాంత్ ఎంచుకున్న ప్రతిరంగంలోనూ ఆయన రాణించాలని కోరుకుంటున్నట్లు అన్వర్‌ ఇబ్రహీం తెలిపారు. 

 ‘పుష్ప ది రూల్‌’ రిలీజ్‌ డేట్‌.. ప్రకటించిన టీమ్‌

ఇక 2017లోనూ రజనీకాంత్‌ను అప్పటి మలేషియా ప్రధాని నజీబ్‌ రజాక్‌ కలిసిన విషయం తెలిసిందే. దీంతో మలేషియా పర్యాటక శాఖకు రజనీ బ్రాండ్‌ అంబాసిడర్‌ కానున్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే వాటిపై స్పందించిన రజనీ.. ‘కబాలి’ షూటింగ్‌ ఎక్కువ భాగం మలేషియాలో జరిగిందని.. ఆ సమయంలో ప్రధానిని కలవడం కుదరకపోవడంతో ఇప్పుడు ఆయనను ఆహ్వానించినట్లు తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు