Rajinikanth: విజయకాంత్‌ అంత్యక్రియల్లో.. కన్నీళ్లు పెట్టుకున్న రజనీకాంత్‌

విజయకాంత్ అంత్యక్రియల్లో పాల్గొన్న రజనీకాంత్‌ (Rajinikanth) కన్నీటి పర్యంతమయ్యారు. ఆ వీడియో చూసిన వారంతా కూడా భావోద్వేగానికి గురవుతున్నారు.

Published : 30 Dec 2023 16:50 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కోలీవుడ్‌ నటుడు, డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్‌ (vijayakanth) అంత్యక్రియల్లో రజనీకాంత్ కన్నీటిపర్యంతమయ్యారు. దీంతో అక్కడున్న వారంతా కూడా భావోద్వేగానికి గురయ్యారు. అనారోగ్య కారణాల వల్ల గురువారం తుదిశ్వాస విడిచిన విజయకాంత్‌ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు. తన మిత్రుడిని చివరిసారి చూసిన రజనీకాంత్‌ (Rajinikanth) వారి అనుబంధాన్ని గుర్తుచేసుకుని కన్నీరు పెట్టుకున్నారు.

‘‘విజయకాంత్ మరణించారని తెలిసి నా హృదయం ముక్కలైంది. ఆయన మరణం తమిళనాడు ప్రజలకు తీరని లోటు. గొప్ప సంకల్పశక్తి ఉన్న వ్యక్తి. చివరిసారిగా అతడిని డీఎండీకే మీటింగ్‌లో చూశాను. కోలుకున్నందుకు ఎంతో ఆనందించా. విజయకాంత్‌ నాకు మంచి స్నేహితుడు. ఒక్కమాటలో చెప్పాలంటే స్నేహానికి ప్రతిరూపం. ఒక్కసారి అతడితో స్నేహం చేస్తే ఎవరూ మర్చిపోలేరు. అతడి కోసం చాలామంది తమ ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన కోపం వెనుక కూడా సరైన కారణం ఉంటుంది. స్వార్థానికి చోటుండదు’’.

‘‘మా ఇద్దరి మధ్య గొప్ప అనుబంధం ఉంది. నేను ఒకసారి ఆసుపత్రిలో ఉంటే నన్ను చూడడానికి వేలమంది అభిమానులు వచ్చారు. వాళ్లను నియంత్రించడం ఆసుపత్రి సిబ్బంది, పోలీసుల వల్ల కూడా కాలేదు. కానీ, విజయకాంత్‌ వాళ్లందరినీ 5 నిమిషాల్లో కంట్రోల్ చేశాడు. ఆ సమయంలో ఆయన చేసిన సాయం ఎప్పటికీ మర్చిపోలేను. చివరి రోజుల్లో ఆయన్ను చూడడానికి నాకు వీలుకాలేదు. వేలమంది పుడుతూ మరణిస్తూ ఉంటారు. కానీ, విజయకాంత్ లాంటి వాళ్లు ఎప్పటికీ ప్రజల గుండెల్లో నిలిచి ఉంటారు’’ అంటూ ఎమోషనల్ అయ్యారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని