Rashmika: అలా చేస్తే ఎందులోనైనా విజయం సాధించవచ్చు..: రష్మిక
ఎప్పుడూ సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది హీరోయిన్ రష్మిక (Rashmika). తాజాగా ఆమె చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.
హైదరాబాద్: తన అందంతో అందరినీ ఆకట్టుకుంటుంది హీరోయిన్ రష్మిక (Rashmika). ‘పుష్ప’(Pushpa) సినిమాతో నేషనల్ క్రష్‌గా మారిన ఈ భామ టాలీవుడ్‌లోనే కాదు అటు బాలీవుడ్‌లోనూ స్టార్ హీరోల సరసన వరుస ఆఫర్లు అందుకుంటోంది. తన వ్యక్తిగత విషయాలను, సినిమాకు సంబంధించిన విషయాలను సోషల్‌మీడియాలో పంచుకుంటూ ఉంటుంది. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న రష్మిక తాజాగా చేసిన ఓ పోస్ట్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్‌గా మారింది.
జిమ్‌లో వ్యాయమం చేస్తోన్న వీడియో షేర్ చేసిన రష్మిక..‘‘నేను ఒకప్పుడు బలంగా ఉన్న స్త్రీలను చూసి నేనూ అలా ఎప్పుడు ఉంటానో అనుకున్నాను. ఈ వీడియో చూస్తుంటే నేను అలానే ఉన్నానని అర్థమవుతోంది. ఇలా మారడం కోసం నేను చాలా రోజులుగా ప్రయత్నిస్తున్నా. మనం ఏకాగ్రతతో ఏదైనా పని తలపెట్టి కష్టపడితే కచ్చితంగా విజయం సాధించవచ్చు’’ అంటూ స్ఫూర్తిమంతమైన నోట్‌ను షేర్ చేసింది. ఇటీవల కొన్ని విమర్శలు ఎదుర్కొన్న రష్మిక.. కొందరు తన గురించి మాట్లాడిన పదాలు తనని మానసికంగా బాధించాయని తెలిపింది. ఏం మాట్లాడాలో స్పష్టంగా చెప్పాలని కోరింది. ఇక తాజాగా ఆమె నటించిన తొలి బాలీవుడ్ మూవీ ‘మిషన్ మజ్ను’ నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. దీంతో పాటు రణ్‌బీర్ కపూర్, సందీప్‌రెడ్డి వంగా కాంబినేషన్‌లో వస్తున్న ‘యానిమల్’తో పాటు, అల్లు అర్జున్ (Allu arjun) ‘పుష్ప: ది రూల్’ (Pushpa 2: The Rule )లోనూ రష్మిక నటిస్తోంది. ఫిబ్రవరి నుంచి జరిగే షెడ్యూల్‌లో ఆమె పాల్గొంటుంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
అగ్గి చల్లారిందా..? రాహుల్-ఉద్ధవ్ మధ్య ‘సావర్కర్ వివాదం’ సద్దుమణిగిందా..?
-
General News
Viveka Murder Case: ముందస్తు బెయిల్ ఇవ్వండి.. హైకోర్టును ఆశ్రయించిన అవినాష్‌రెడ్డి
-
Movies News
Social Look: పల్లెటూరి అమ్మాయిగా దివి పోజు.. శ్రీముఖి ‘పింక్’ పిక్స్!
-
World News
Mexico-US Border: శరణార్థి శిబిరంలో ఘోర అగ్నిప్రమాదం.. 39 మంది మృతి..!
-
Sports News
Cricket: నాన్‌స్ట్రైకర్ రనౌట్.. బ్యాట్ విసిరి కొట్టిన బ్యాటర్
-
General News
Amaravati: రాజధాని అమరావతిపై రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనను తిరస్కరించిన సుప్రీంకోర్టు