Rashmika: అలా చేయడం ఆమోదయోగ్యం కాదు.. ‘పుష్ప2’ ఫొటో లీక్‌పై రష్మిక అసహనం..

‘పుష్ప2’ సెట్‌ నుంచి ఫొటో లీక్‌ కావడంపై రష్మిక అసహనం వ్యక్తం చేశారు.

Published : 03 Feb 2024 13:37 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అల్లు అర్జున్‌ (Allu arjun) హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా ‘పుష్ప2’ (Pushpa2). ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రియులంతా దీని కోసం ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమాలో అల్లు అర్జున్‌కు సంబంధించిన ఫొటో లీకైన సంగతి తెలిసిందే. దానిపై రష్మిక స్పందిస్తూ అసహనం వ్యక్తం చేశారు.

‘షూటింగ్‌ సెట్‌ నుంచి ఇలా నటీనటుల చిత్రాలను లీక్‌ చేయడం ఆమోదయోగ్యంకాదు. ఈ సినిమా కోసం ఎంతోమంది ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. అలా అని లీకైన ఫొటోలను షేర్‌చేయకూడదు. సినిమాకు సంబంధించిన ఫొటోలు ముందే చూస్తే విడుదలయ్యాక ఆసక్తి ఉండదు. సరైన సమయంలో ఈ చిత్రం మీ ముందుకు వస్తుంది. థియేటర్‌లో మీకు వందశాతం వినోదాన్ని పంచడం కోసం టీమ్ అంతా ఎంతో శ్రమిస్తుంది. దయచేసి సినిమా ప్రైవసీకి భంగం కలిగించొద్దు. ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. అందరికీ పుష్ప2పై ఉన్న ఉత్కంఠను నేను అర్థం చేసుకుంటాను’ అని చెప్పింది. 

టెక్నాలజీని నిందించడం సరికాదు.. డీప్‌ ఫేక్‌లపై కృతి సనన్‌ కామెంట్స్‌

2021 డిసెంబరులో విడుదలై ఘన విజయాన్ని అందుకున్న ‘పుష్ప’కు సీక్వెల్‌గా ‘పుష్ప 2’ తెరకెక్కుతోంది. రష్మిక (Rashmika) శ్రీవల్లిగా కనిపించనున్నారు. ‘పుష్ప’ బాక్సాఫీసు వద్ద అత్యధిక వసూళ్లు రాబట్టడం, అందులోని నటనకుగాను అల్లు అర్జున్‌కు జాతీయ అవార్డురావడం, దేవిశ్రీ ప్రసాద్‌కు ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ పురస్కారం దక్కడంతో ‘పుష్ప 2’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ఏడాది ఆగస్టు 15న ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని