Renu Desai: పవన్‌ గురించి రెండు సందర్భాల్లోనూ నిజమే చెప్పా: రేణూ దేశాయ్‌

పవన్‌ కల్యాణ్‌ (Pawan kalyan) మాజీ భార్య రేణూ దేశాయ్ మరోసారి తనపై వస్తున్న ఆరోపణల గురించి మాట్లాడారు. పవన్‌ గురించి అప్పుడూ, ఇప్పుడూ రెండు సందర్భాల్లోనూ నిజమే చెప్పానని ఆమె వెల్లడించారు.

Updated : 17 Aug 2023 10:09 IST

హైదరాబాద్‌: పవన్‌ కల్యాణ్ (Pawan kalyan) మాజీ భార్య రేణూ దేశాయ్‌ (Renu Desai) మరోసారి వైరల్ కామెంట్స్‌ చేశారు. ఓ అభిమాని ఆమె విడాకులపై అభ్యంతరకర కామెంట్‌ పోస్టుచేయగా.. రేణూ అతడికి స్ట్రాంగ్‌ రిప్లై ఇచ్చారు. ‘‘నన్ను నిందించడంలో మీకు ఆనందం ఉంటే అలానే చేయండి. పవన్‌ కల్యాణ్‌ వ్యతిరేకుల నుంచి నిందలు పడటం నా జీవిత లక్ష్యం అనుకుంటా..’’ అని రేణూ దేశాయ్‌ రిప్లై ఇచ్చారు. 

పవన్‌కల్యాణ్‌కే నా మద్దతు.. ఆయన డబ్బు మనిషి కాదు: రేణూ దేశాయ్‌

ఇటీవల ఆమె పవన్‌ కల్యాణ్‌కు మద్దతు ప్రకటిస్తూ వీడియో షేర్‌ చేసిన విషయం తెలిసిందే. దీనిపై కొందరు వ్యక్తులు ఆమెను టార్గెట్‌ చేసి మాట్లాడారని రేణూ చెప్పారు. ‘‘విడాకుల గురించి చెప్పినప్పుడు పవన్‌ కల్యాణ్‌ అభిమానులు నన్ను తీవ్రంగా ద్వేషించారు. ఇప్పుడు దేశ పౌరురాలిగా ఆయనకు మద్దతుగా మాట్లాడుతుంటే అతడి వ్యతిరేకులు నన్ను దుర్భాషలాడుతున్నారు. తొలుత విడాకుల గురించి మాట్లాడి.. ఆయన వ్యతిరేకుల నుంచి డబ్బు తీసుకున్నానని ఆరోపించారు. ఇప్పుడేమో.. పవన్‌ అనుకూల వ్యక్తుల నుంచి నేను సొమ్ము తీసుకుని ఆయనకు మద్దతిచ్చానని అంటున్నారు. నా మాజీ భర్త గురించి అప్పుడూ, ఇప్పుడూ రెండు సందర్భాల్లోనూ నేను నిజమే చెప్పాను. తప్పుగా ఒక్కమాట కూడా మాట్లాడలేదు. ప్రేమలో పడినందుకు.. నిజాలు మాట్లాడుతున్నందుకు నేను ఇలా మూల్యం చెల్లించాల్సి వస్తోంది. ఇదే నా విధి రాత అయితే.. ఇలానే తిట్టండి.. ఈ కామెంట్స్‌పై కూడా నన్ను నిందించడం ప్రారంభించండి’’ అని రాసుకొచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని