Renu Desai: పవన్‌కల్యాణ్‌కే నా మద్దతు.. ఆయన డబ్బు మనిషి కాదు: రేణూ దేశాయ్‌

పవన్‌కల్యాణ్‌ (Pawan kalyan) కే తన మద్దతు ఉంటుందని ఆయన మాజీ సతీమణి రేణూ దేశాయ్‌ (Renu Desai) అన్నారు.

Updated : 10 Aug 2023 16:59 IST

హైదరాబాద్‌: పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan) పేదల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని, డబ్బు మనిషి కాదని ఆయన మాజీ సతీమణి రేణూ దేశాయ్‌ (Renu Desai) పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె ఇన్‌స్టాలో ఓ వీడియోను షేర్‌ చేశారు. పవన్‌ చాలా అరుదైన వ్యక్తి అని, రాజకీయంగా ఆయనకే తన మద్దతు ఉంటుందని ఆమె చెప్పారు. అంతేకాకుండా ‘బ్రో’ సినిమా శ్యాంబాబు వివాదంపైనా ఆమె మాట్లాడారు.

‘‘మొదటి రోజు నుంచి ఇప్పటివరకూ పవన్‌కల్యాణ్‌ను రాజకీయంగా సపోర్ట్ చేస్తూనే ఉన్నా.  నేను జీవితంలో ముందుకు సాగిపోతున్నా.  ఆయన సమాజం కోసం మంచి చేయాలనుకుంటున్నారు. నాకు తెలిసినంత వరకూ ఆయన అరుదైన వ్యక్తి. ఆయన మనీ మైండెడ్‌ కాదు. డబ్బుపై ఆసక్తి లేదు. సమాజం, పేదవాళ్ల సంక్షేమం కోసం పని చేయాలనుకుంటున్నారు.  ఆయనకు పొలిటికల్‌గా ఎప్పుడూ సపోర్ట్‌ చేస్తుంటా. రాజకీయంగా ఆయన చేస్తున్న సేవను గుర్తించండి. ఆయనొక సక్సెస్‌ఫుల్‌ నటుడు. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఫ్యామిలీని పక్కన పెట్టి ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. దయచేసి ఆయనకు ఒక అవకాశం ఇవ్వండి. ప్రతిసారీ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడకండి. మూడు పెళ్లిళ్లపై చర్చ దయచేసి ఆపండి. నా పిల్లలనే కాదు, మిగిలిన ఇద్దరు పిల్లలను ఇలాంటి వాటిల్లోకి లాగకండి. ఎందుకంటే వాళ్లు ఇంకా చిన్నపిల్లలే’’ అని ఆమె చెప్పారు.

ఈ వారం ఓటీటీలో ఏకంగా 23 చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు!

ఇదే వీడియోలో ఆమె శ్యాంబాబు విషయంపై మాట్లాడుతూ.. ‘‘ఇటీవల విడుదలైన ఓ సినిమాలోని సన్నివేశాలు వివాదానికి దారి తీశాయని తెలిసింది. ఆ వివాదం గురించి నాకు పెద్దగా అవగాహన లేదు. కాకపోతే, పవన్‌పై సినిమా, వెబ్‌ సిరీస్‌ చేస్తామని ఇటీవల కొంతమంది అన్నారు. ఆయన పెళ్లిళ్లు, భార్యలు, పిల్లల గురించి ఈ సినిమా ఉంటుందని చెప్పారు. ఒక తల్లిగా నా వ్యక్తిగత అభ్యర్థన కోసమే ఈ వీడియో చేస్తున్నా. పరిస్థితులు ఏమైనా సరే దయచేసి పిల్లలను అందులోకి లాగకండి. మా పిల్లలు సినీ నేపథ్యం ఉన్న కుటుంబంలో పుట్టారు. నా పిల్లల తండ్రి నటుడు, రాజకీయనాయకుడు. నా పిల్లలనే కాదు, ఏ పిల్లలను, ఆడవాళ్లను రాజకీయాల్లోకి లాగొద్దు. రాజకీయంగా ఏదైనా ఉంటే మీరూ మీరూ చూసుకోండి. ’’ అని ఆమె అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని