RRR: ఇఫీలో ప్రదర్శనకు ఆర్‌ఆర్‌ఆర్‌, అఖండ

గోవాలో వచ్చే నెల 20 నుంచి 28 వరకు జరగనున్న 53వ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా(ఇఫి)లో మెయిన్‌ స్ట్రీమ్‌ సినిమా సెక్షన్‌లో తెలుగునుంచి రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ ప్రధాన పాత్రల్లో వచ్చిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’...

Updated : 23 Oct 2022 13:45 IST

గోవాలో వచ్చే నెల 20 నుంచి 28 వరకు జరగనున్న 53వ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా(ఇఫి)లో (IFFI) మెయిన్‌ స్ట్రీమ్‌ సినిమా సెక్షన్‌లో తెలుగునుంచి రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ ప్రధాన పాత్రల్లో వచ్చిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR), బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శీను దర్శకత్వంలో వచ్చిన ‘అఖండ‘లు (Akhanda) ప్రదర్శితం కానున్నాయి. ఇవి కాకుండా ఇందులో ప్రదర్శనకోసం 25 ఫీచర్‌ ఫిల్మ్స్‌, 20 నాన్‌ ఫీచర్‌ ఫిల్మ్స్‌ ఎంపికయ్యాయి. ఈ విభాగంలో తెలుగునుంచి ఎంపికైన వాటిలో కండ్రేగుల ప్రవీణ్‌ దర్శకత్వంలో వచ్చిన సినిమా బండి, విద్యాసాగర్‌ రాజు దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఖుధిరాంబోస్‌ సినిమాలు ఉన్నాయి. మేజర్‌ హిందీ చిత్రం కూడా ఈ విభాగంలో ఎంపిక అయింది.నాన్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ విభాగంలో తెలుగునుంచి ఒక్కటీ ఎంపిక కాలేదు.

- ఈనాడు, దిల్లీ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని