Ray Stevenson: రే స్టీవెన్సన్‌ మరణ వార్త.. షాక్‌కు గురయ్యాం: ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్‌

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) సినిమాలో గవర్నర్‌ స్కాట్‌ పాత్రలో కనిపించి ప్రేక్షకులను అలరించారు ఐరిష్‌ నటుడు రే స్టీవెన్సన్‌ (Ray Stevenson). ఆయన హఠాన్మరణం చెందారనే వార్త సోమవారం రాత్రి బయటకు వచ్చింది. ఈ నేపథ్యంలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సభ్యులు ఆయనకు సోషల్‌మీడియా వేదికగా సంతాపం ప్రకటించారు.

Published : 23 May 2023 14:45 IST

హైదరాబాద్‌: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) సినిమాలో కీలకపాత్ర పోషించిన ఐరిష్‌ నటుడు రే స్టీవెన్సన్‌ (Ray Stevenson) (58) మరణవార్తపై చిత్రబృందం సంతాపం ప్రకటించింది. రే మరణవార్త తమను ఎంతగానో కలచివేసిందని ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ పేర్కొంది. ఈ మేరకు రాజమౌళి, ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌, కార్తికేయ ఆయన్ని గుర్తు చేసుకుంటూ తాజాగా ట్వీట్స్‌ చేశారు. రే మరణవార్తను తాము నమ్మలేకపోతున్నామని అన్నారు.

‘‘షాకింగ్‌.. ఈ వార్తను నేను నమ్మలేకపోతున్నా. రే సెట్‌లో ఉన్నారంటే ఆ ప్రదేశం మొత్తం ఎంతో సంతోషం, ఫుల్‌ ఎనర్జీతో ఉంటుంది. ఆయనతో కలిసి పనిచేయడం నాకెంతో సంతోషాన్ని ఇచ్చింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. అలాగే ఆయన కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’’ - రాజమౌళి

‘‘రే స్టీవెన్సన్‌ హఠాన్మరణం షాక్‌కు గురి చేసింది. ఆయనతో కలిసి వర్క్‌ చేయడం గొప్ప అనుభూతి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఇలాంటి క్లిష్ట సమయంలో ఆయన కుటుంబసభ్యులు, సన్నిహితులకు ఆ భగవంతుడు ధైర్యాన్ని అందించాలని కోరుకుంటున్నా’’ - ఎన్టీఆర్‌

‘‘రే మరణవార్త నన్ను ఎంతో బాధకు గురి చేసింది. డియర్‌ స్కాట్‌.. మీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా. మిమ్మల్ని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటా’’ - రామ్‌చరణ్‌

‘‘షాకింగ్‌.. మీరు ఇంత త్వరగా మమ్మల్ని వదలివెళ్లిపోవడం బాధాకరం. మంచి మనసు ఉన్న వ్యక్తి. RIP’’ - ఎస్‌.ఎస్‌.కార్తికేయ

‘‘(ఆర్‌ఆర్‌ఆర్‌లోని ఓ ఫైట్‌ సీక్వెన్స్‌లో ఆయన కారులో నుంచి పైకి ఎగిరి గన్‌తో షూట్‌ చేస్తారు. దానిని ఉద్దేశిస్తూ..) ఈ క్లిష్టమైన సన్నివేశాన్ని చిత్రీకరించినప్పుడు ఆయన వయసు 56 ఏళ్లు. అయినప్పటికీ ఈ స్టంట్‌ చేయడానికి ఆయన ఏమాత్రం సంకోచించలేదు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ వేదికగా మిమ్మల్ని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాం.’’ - ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని