Salman Khan: నెటిజన్ల నుంచి ట్రోల్స్‌.. పోస్ట్‌ తొలగించిన సల్మాన్‌ఖాన్‌

ఇటీవల విడుదలైన ఓ హిందీ సినిమా గురించి పోస్ట్‌ చేసి విమర్శలు ఎదుర్కొన్నారు బాలీవుడ్‌ అగ్ర కథానాయకుడు సల్మాన్‌ఖాన్‌ (SalmanKhan).

Published : 14 Mar 2024 20:22 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: బాలీవుడ్‌ అగ్ర కథానాయకుడు సల్మాన్‌ఖాన్‌ (Salman Khan) సోషల్‌మీడియాలో విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇటీవల విడుదలైన ఓ చిత్రాన్ని ఉద్దేశించి ఆయన చేసిన పోస్ట్‌ ఇప్పుడు అంతటా వైరల్‌గా మారింది. దీంతో ఆ పోస్ట్‌ తొలగించేశారు. ఇంతకీ ఆయన ఏ సినిమా గురించి మాట్లాడారంటే..?

బాలీవుడ్‌ నటుడు ఆమిర్‌ఖాన్‌ మాజీ సతీమణి, దర్శకురాలు కిరణ్‌రావు తెరకెక్కించిన సరికొత్త చిత్రం ‘లాపతా లేడీస్‌’. కామెడీ డ్రామాగా సిద్ధమైన ఈ చిత్రం మార్చి 1న విడుదలై మంచి స్పందన సొంతం చేసుకుంది. ఈనేపథ్యంలోనే దీనిని ఉద్దేశించి సల్మాన్‌ఖాన్‌ బుధవారం సాయంత్రం ఆసక్తికర ట్వీట్‌ చేశారు. తన తండ్రితో కలిసి ‘లాపతా లేడీస్‌’ సినిమా వీక్షించానని చెప్పిన ఆయన.. అది తమకెంతో నచ్చిందన్నారు. ఈ చిత్రంతో దర్శకురాలిగా తొలి అడుగువేసిన కిరణ్‌రావుకు అభినందనలంటూ పోస్ట్‌ పెట్టారు. దీనిని చూసిన పలువురు నెటిజన్లు విమర్శలు చేశారు. ‘‘సర్‌ జీ.. ఇది కిరణ్‌రావు తెరకెక్కించిన తొలి చిత్రం కాదు. దీనికంటే ముందు ఆమె ‘ధోబీఘాట్‌’కు దర్శకత్వం వహించారు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఆ సినిమా ప్రీమియర్‌కు మీరు హాజరయ్యారు’’ అని వరుస కామెంట్స్‌ వచ్చాయి. దీంతో ఆయన పాత పోస్ట్‌ను తొలగించారు. గురువారం సాయంత్రం మరో పోస్ట్‌ పెట్టారు. ‘‘మీ వర్క్‌ చాలా బాగుంది కిరణ్‌రావు. నాతో కలిసి వర్క్‌ చేస్తారా’’ అని రాసుకొచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని