Samantha: జీవితంలో తీసుకున్న కఠిన నిర్ణయమదే: సమంత

ఆరోగ్య పరమైన సమస్యల దృష్ట్యా నటి సమంత (Samantha) యాక్టింగ్‌ నుంచి కొంతకాలం బ్రేక్‌ తీసుకున్న విషయం తెలిసిందే. తనకు ఇష్టమైన ప్రదేశాల సందర్శన, ధ్యానం, చికిత్స.. ఇలా తన బ్రేక్‌ టైమ్‌ను ఎంజాయ్‌ చేశారు. 

Published : 08 Mar 2024 17:33 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: యాక్టింగ్‌ నుంచి చిన్న విరామం తీసుకోవడంపై నటి సమంత (Samantha) స్పందించారు. ప్రముఖ మ్యాగజైన్‌ ఫొటోషూట్‌లో పాల్గొన్న ఆమె ఈ విషయంపై మాట్లాడారు. జీవితంలో తీసుకున్న క్లిష్టమైన నిర్ణయం అదేనన్నారు. ‘‘మయోసైటిస్‌ నుంచి కోలుకునే క్రమంలో వృత్తిపరమైన జీవితం నుంచి విరామం తీసుకున్నా. ఇప్పటివరకూ తీసుకున్న కఠిన, ఉత్తమమైన నిర్ణయమదే. ఆరోగ్య పరిస్థితుల రీత్యా వర్క్‌ కంటిన్యూ చేయడం వీలుపడలేదు. పని పరంగా ఒత్తిడి, ఇతర విషయాలను తట్టుకోవడం అంత సులభం కాదు.

దాదాపు 13 ఏళ్ల నుంచి పని చేస్తున్నా. కోపం, ఆత్మనూన్యతకు లోనైన సందర్భాలున్నాయి. వాటన్నింటినీ ఎదుర్కొని మనిషిగా ఎదగాలని శ్రమించా. ఈ క్రమంలోనే నాలోని అభద్రతా భావాలు తెలిసొచ్చాయి. ఎదుటి వ్యక్తులతో ఆయా విషయాల గురించి మాట్లాడి.. నన్ను నేను మెరుగుపరచుకున్నా’’ అని సమంత చెప్పారు.

ట్రోల్స్‌, విమర్శల మధ్య వ్యత్యాసం గ్రహించగలుగుతున్నానని చెప్పిన ఆమె.. వివరణాత్మక విమర్శలను స్వీకరించేందుకు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటానని చెప్పారు. కష్టసుఖాల్లో అభిమానులు అండగా నిలిచారన్నారు. వారు చూపిస్తోన్న ప్రేమాభిమానాలకు ఎప్పుడూ రుణపడి ఉంటానని తెలిపారు. ‘సిటాడెల్‌’లో తన పాత్ర తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుందన్నారు. తానెంతో ఇష్టపడి ఆ పాత్ర పోషించానన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని