Samantha: తన బెస్ట్ ఫ్రెండ్స్‌ని పరిచయం చేసిన సమంత
అగ్ర కథానాయిక సమంత(Samantha) తాజాగా తన ఇన్‌స్టాగ్రాంలో పెట్టిన పోస్ట్ ఆసక్తిగా మారింది. కళ్లజోడు పెట్టుకున్న ఫొటో షేర్ చేసిన ఆమె.. గ్లాసెస్ తన బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పింది.
హైదరాబాద్: అగ్ర కథానాయిక సమంత(Samantha) ప్రస్తుతం మయోసైటిస్ నుంచి కోలుకుంటోంది. తన జీవితంలో జరిగే ప్రతి అంశాన్ని సోషల్‌మీడియా ద్వారా అభిమానులతో పంచుకునే ఆమె తాజా పోస్ట్ నెటిజన్లను ఆకర్షిస్తోంది. కళ్లజోడు పెట్టుకున్న ఫొటోను ఇన్‌స్టా స్టోరీలో పంచుకున్న ఆమె ‘‘ఈ గ్లాసెస్ నా కొత్త బెస్ట్ ఫ్రెండ్స్’’ అని క్యాప్షన్ పెట్టింది. ఇది చూసిన ఫ్యాన్స్ ‘‘ఈ కళ్లజోడు వల్ల మీ అందం మరింత పెరిగింది’’ అని కామెంట్స్ చేస్తున్నారు. వారి అభిమాన నటి మళ్లీ సోషల్‌మీడియాలో యాక్టీవ్ అయినందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఏ పాత్రలో నటించినా దానికి జీవం పోసే సామ్ ప్రస్తుతం తన తదుపరి ప్రాజెక్ట్ ‘సిటాడెల్’పై దృష్టి పెట్టింది. తన పాత్రకు అనుగుణంగా సిద్ధమయ్యేందుకు ఫిట్‌నెస్ పెంచుకుంటోంది. ఇటీవలే ఈ విషయాన్ని తెలుపుతూ సమంత ఇన్‌స్టాలో ఓ వీడియో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు సమంత నటించిన తాజా చిత్రం ‘శాకుంతలం’ (Shaakuntalam)విడుదలకు సిద్ధమైంది. ప్రస్తుతం నిర్మాణాంతర పనుల్లో ఉన్న ఈ సినిమా ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. గుణశేఖర్ (Gunasekhar) దర్శకత్వంలో రూపొందిన ఈ అందమైన ప్రేమకావ్యంపై ఇప్పటికే అభిమానులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు. శకుంతలగా సమంత (Samantha) నటించగా.. దుష్యంతుడి పాత్రను దేవ్ మోహన్ (Dev Mohan) పోషించారు. ఇప్పటివరకు ఈ సినిమాలో విడుదలైన రెండు పాత్రలూ మంచి ప్రేక్షకాదరణ పొందాయి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
ashok chavan: మోదీ బండారం బయటపడుతుందనే రాహుల్‌పై అనర్హత: అశోక్ చవాన్
-
India News
అగ్గి చల్లారిందా..? రాహుల్-ఉద్ధవ్ మధ్య ‘సావర్కర్ వివాదం’ సద్దుమణిగిందా..?
-
General News
Viveka Murder Case: ముందస్తు బెయిల్ ఇవ్వండి.. హైకోర్టును ఆశ్రయించిన అవినాష్‌రెడ్డి
-
Movies News
Social Look: పల్లెటూరి అమ్మాయిగా దివి పోజు.. శ్రీముఖి ‘పింక్’ పిక్స్!
-
World News
Mexico-US Border: శరణార్థి శిబిరంలో ఘోర అగ్నిప్రమాదం.. 39 మంది మృతి..!
-
Sports News
Cricket: నాన్‌స్ట్రైకర్ రనౌట్.. బ్యాట్ విసిరి కొట్టిన బ్యాటర్