Samantha: బొకే అందుకోవాలంటే భయమేస్తోంది: సమంత

పువ్వులను చూస్తే భయమేస్తుందని నటి సమంత అన్నారు. తాజాగా ఓ అందమైన ఫొటోను ఆమె ఇన్‌స్టాలో పంచుకున్నారు.

Updated : 14 Jan 2024 18:10 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: స్టార్‌ హీరోయిన్‌ సమంత (Samantha) నటనకు విరామం ప్రకటించి ఆరోగ్యంపై పూర్తి శ్రద్ధ పెట్టారు. సోషల్‌ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఆమె తాజాగా ఓ అందమైన ఫొటోను షేర్‌ చేశారు. పువ్వుల బొకే అందుకుంటున్నట్లు ఉన్న చిత్రాన్ని పంచుకున్న సమంత.. వాటిని తాకాలంటే భయమేస్తోందని పేర్కొన్నారు. ‘ఇలాంటి బొకేలు చూసినప్పుడు మిశ్రమ భావనలు కలుగుతాయి. ఎందుకంటే నేను పువ్వులను ఇష్టపడతాను. కానీ నా శరీరానికి వీటి వల్ల ఎలర్జీ వస్తుంది. గతంలో ఈ పువ్వుల కారణంగానే నేను ఎమర్జెన్సీ రూమ్‌కు వెళ్లాల్సొచ్చింది. అందుకే వీటిని చూస్తే భయమేస్తుంది’ అని రాశారు. ఇది వైరల్‌గా మారడంతో దీన్ని చూసిన వారంతా ఇందులో సమంత చాలా క్యూట్‌గా ఉన్నారంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

‘హనుమాన్‌’తో ప్రశాంత్‌ వర్మ ఇండస్ట్రీకి పాఠాన్ని నేర్పాడు: రామ్‌ గోపాల్‌ వర్మ

గతేడాది ‘ఖుషి’ (Kushi)తో అలరించిన సమంత త్వరలో ‘సిటాడెల్‌’ (ఇండియన్‌ వెర్షన్‌) (Citadel) వెబ్‌సిరీస్‌తో సందడి చేయనున్నారు. బాలీవుడ్‌ నటుడు వరుణ్‌ ధావన్‌ మరో కీలక పాత్రధారి. రాజ్‌, డీకే దర్శకత్వం వహించారు. మరోవైపు, సమంత కొన్ని రోజుల క్రితం నిర్మాతగానూ మారిన సంగతి తెలిసిందే. ‘ట్రా లా లా మూవింగ్‌ పిక్చర్స్‌’ పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించినట్లు సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించారు. కొత్త ప్రతిభను ప్రోత్సాహిస్తూ.. అర్థవంతమైన, ప్రామాణికమైన, విశ్వజనీనమైన కథల్ని ఈ వేదికపై నిర్మించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన మరో వార్త కూడా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారమవుతోంది. అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘పుష్ప2’లో ఆమె మరోసారి ఐటెమ్‌ సాంగ్‌ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని