Ram Gopal Varma: ‘హనుమాన్‌’తో ప్రశాంత్‌ వర్మ ఇండస్ట్రీకి పాఠాన్ని నేర్పాడు: రామ్‌ గోపాల్‌ వర్మ

తాజా హిట్ ‘హనుమాన్‌’ చిత్ర దర్శకుడిపై రామ్ గోపాల్‌ వర్మ ప్రశంసలు కురిపించారు. తన సోషల్‌ మీడియాలో ఓ వీడియో పోస్ట్‌ చేశారు.

Published : 14 Jan 2024 15:48 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘హనుమాన్‌’ దర్శకుడు ప్రశాంత్‌ వర్మను ప్రశంసలతో ముంచెత్తారు రామ్‌ గోపాల్ వర్మ. పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రం విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో ఈ దర్శకుడి పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. తాజాగా ఆయన తెలివితేటలను మెచ్చుకుంటూ రామ్ గోపాల్ వర్మ ఓ ప్రత్యేక వీడియో పోస్ట్‌ చేశారు.

‘‘తక్కువ బడ్జెట్‌తో కూడా అద్భుతమైన వీఎఫ్‌ఎక్స్‌ చిత్రాలను తెరకెక్కించొచ్చని ప్రశాంత్‌ వర్మ నిరూపించాడు. ఇలాంటి సినిమాలు తీయాలంటే వందల కోట్లు కావాలని భావించే వారికి చెంపదెబ్బలా దీన్ని తీసుకువచ్చారు. ఈ చిత్రంతో ఇండస్ట్రీకి గొప్ప పాఠాన్ని నేర్పాడు. పరిమిత బడ్జెట్‌లో ఇంత అద్భుతమైన సినిమాను తీయాలంటే చాలా తెలివి ఉండాలి. సమగ్రత, పట్టుదల, నిరంతర శ్రమ ఉంటేనే ఇది సాధ్యమవుతుంది. ఈ సినిమా విజయం సాధించినందుకు మాత్రమే కాదు.. ఎంతోమందికి మంచి పాఠాన్ని నేర్పినందుకు నేను ప్రశాంత్‌ను అభినందించాలనుకుంటున్నా. ఇండస్ట్రీ మొత్తం తరఫున నేను ధన్యవాదాలు చెబుతున్నాను’’ అని ప్రశంసించారు.

ఈ చిత్ర విజయంపై హీరో తేజ సజ్జా ఆనందం వ్యక్తం చేశారు. ఆరంభంలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయని వాటిని దాటేందుకు దైవశక్తే తోడుందన్నారు. హనుమంతుడు సముద్రం దాటినట్లు ఈ చిత్రం కూడా అన్ని అడ్డంకులు దాటుకొని థియేటర్లలోకి వచ్చిందని చెప్పారు. తన కెరీర్‌లో ఇది మైలురాయి లాంటి సినిమా అని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని