Samantha: జీవితంలో నేను చేసిన అతి పెద్ద తప్పు అదే..: సమంత

తన జీవితంలో చేసిన అతి పెద్ద తప్పేమిటో సమంత తెలిపారు.

Updated : 18 Jan 2024 14:20 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నటి సమంత (Samantha) సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉంటారు. తాజాగా ఆమె అభిమానుల ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ఈ సందర్భంగా తన వైవాహిక జీవితం గురించి పరోక్షంగా కామెంట్స్‌ చేశారు. జీవితంలో చేసిన అతి పెద్ద తప్పేంటో చెప్పారు.

‘నా ఇష్టాయిష్టాలను గుర్తించడంలో విఫలమయ్యాను. దానిని చాలా ఆలస్యంగా తెలుసుకున్నాను. ఎందుకంటే గతంలో నా భాగస్వామి వాటిని ప్రభావితం చేశాడు.  క్లిష్ట సమయం నుంచే మనం విలువైన పాఠం నేర్చుకోగలమని అర్థమైంది. ఈ విషయాన్ని గ్రహించిన తర్వాతే నా వ్యక్తిగత ఎదుగుదల మొదలైంది’  అన్నారు. ఇక గతంలోనూ సమంత ఒక ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ తన విడాకులు, వరుస ఫ్లాప్‌లు, ఆరోగ్య సమస్యలు ఒకేసారి చుట్టుముట్టడంతో ఎంతో కుంగిపోయినట్లు తెలిపారు. ఒకవైపు ఆరోగ్యం దెబ్బతింటుంటే.. మరోవైపు వైవాహిక బంధం ముగిసిందని పేర్కొన్నారు. దీంతో కుంగుబాటుకు గురైనట్లు చెప్పారు.

ఆయనే మా దేవుడు.. సంస్కృతిని ఎప్పుడూ తప్పుగా చూపించను: ప్రశాంత్‌ వర్మ

ప్రస్తుతం సమంత సినిమాలకు విరామం ప్రకటించి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టారు. ఆమె నటించిన ‘సిటాడెల్‌’ (ఇండియన్‌ వెర్షన్‌) (Citadel) వెబ్‌సిరీస్ విడుదలకు సిద్ధంగా ఉంది. మరోవైపు, ఆమె కొన్ని రోజుల క్రితం నిర్మాతగానూ మారిన సంగతి తెలిసిందే. ‘ట్రా లా లా మూవింగ్‌ పిక్చర్స్‌’ పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని